యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా యంగ్ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ చిత్రమే “లక్కీ భాస్కర్”. మరి ట్రైలర్ తర్వాత మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాకి ప్రమోషన్స్ ని కూడా జోరుగా మేకర్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలో ఈ సినిమాపై ఈ సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్ ఇచ్చిన స్పెషల్ రివ్యూ వైరల్ గా మారింది. మరి ఎడిటర్ నవీన్ నూలి దాదాపు సితార, హారిక హాసిని వారి సినిమాలకి ఆస్థాన ఎడిటర్ గా ఎన్నో సినిమాకి చేసిన సంగతి తెలిసిందే. అయితే తన నుంచి ఒక సినిమాకి వర్క్ చేయడం ఎంతో ఆనందంగా అనిపించింది అని పోస్ట్ రావడం చాలా అరుదు. కానీ అలాంటిది లక్కీ భాస్కర్ కి మాత్రం తాను పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.
కొన్ని సినిమాలకి వర్క్ మాత్రమే చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. అలా ఈ లక్కీ భాస్కర్ కి చేసినపుడు అనిపించింది అంటూ ఈ మధ్య కాలంలో ఏ సినిమా కోసం చెప్పని తాను ఈ సినిమాకి ప్రత్యేకంగా వేయడం జరిగింది. ఇలాంటి కాన్సెప్ట్ చెప్పడం చాలా బాగుంది అంటూ దర్శకుడు, నిర్మాత నాగవంశీకి అభినందనలు తెలిపారు. దీనితో లక్కీ భాస్కర్ కి ఇది స్పెషల్ రివ్యూనే అని చెప్పొచ్చు.
#LuckyBaskhar was one of those projects that brought immense work satisfaction.
Successfully executing such a concept with expertise— applause to #VenkyAtluri and @vamsi84.And what a stellar performance by @dulQuer! #LuckyBaskharOnOct31st
????????????— Navin Nooli (@NavinNooli) October 28, 2024