‘ల‌క్కీ భాస్క‌ర్’ టైటిల్ ట్రాక్ ప్రోమో.. అదిరింది!

‘ల‌క్కీ భాస్క‌ర్’ టైటిల్ ట్రాక్ ప్రోమో.. అదిరింది!

Published on Jul 27, 2024 6:56 PM IST

మ‌ల‌యాళ న‌టుడు దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ”ల‌క్కీ భాస్క‌ర్” ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో మంచి బజ్ ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను స‌క్సెస్ ఫుల్ ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తుండ‌టంతో ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్ష‌కుల్లో మంచి అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. దీనికి తోడు ఈ సినిమా ఫ‌స్ట్ సింగిల్ సాంగ్ కి కూడా మంచి రెస్పాన్స్ రావ‌డంతో, ఈ మూవీ నుంచి మ‌రిన్ని అప్డేట్స్ కోసం ఆడియెన్స్ వెయిట్ చేస్తున్నారు.

ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ట్రాక్ పై మేక‌ర్స్ ఇప్ప‌టికే సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సాంగ్ ను జూలై 28న రిలీజ్ చేస్తున్న‌ట్లు వారు తెలిపారు. తాజాగా ఈ టైటిల్ ట్రాక్ ప్రోమోను కూడా మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఇది క్యాచీ ట్యూన్ తో ఉండ‌టంతో ప్రేక్ష‌కులు ఈ పాట కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ప్ర‌ముఖ సింగ‌ర్ ఉషా ఉతుప్ ఈ సాంగ్ ను రాకింగ్ గా పాడారు.

జివి.ప్ర‌కాశ్ కుమార్ సంగీతం ఈ సినిమాకు మేజ‌ర్ అసెట్ గా నిల‌వ‌నుంద‌ని ఈ సాంగ్ కూడా ప్రూవ్ చేయ‌నుంది. ఇక ఈ సినిమాలో అందాల భామ మీనాక్షి చౌద‌రి హీరోయిన్ గా న‌టిస్తోండ‌గా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యాన‌ర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 7న రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

వీడియో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు