ఓటీటీలో అదరగొడుతున్న లక్కీ భాస్కర్

ఓటీటీలో అదరగొడుతున్న లక్కీ భాస్కర్

Published on Dec 1, 2024 12:00 PM IST

మళయాళ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన “లక్కీ భాస్కర్”కి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అటు ప్రేక్షకులతో పాటు ఇటు విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలను అందుకుంది ఈ సినిమా. కాగా ఈ సినిమా ఓటీటీలో దూసుకుపోతోంది. పైగా 15 దేశాల్లో టాప్-10 లిస్టులో చోటు దక్కించుకోవడం విశేషం. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

అన్నట్టు అటు బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమాకి సాలిడ్ కలెక్షన్స్ వచ్చాయి. రెండు వారాల్లోనే రూ. 100 కోట్లు కలెక్ట్ చేసింది ఈ చిత్రం. మొత్తానికి థియేటర్లలో మంచి ప్రదర్శనను కొనసాగించింది. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫర్ సినిమాస్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు