ఘనంగా లవ్ యువర్ ఫాదర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్

ఘనంగా లవ్ యువర్ ఫాదర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్

Published on Mar 28, 2025 9:00 PM IST

దివంగత లెజెండరీ సింగర్ SP బాలసుబ్రహ్మణ్యం తనయుడు సింగర్ SP చరణ్ చాలా ఏళ్ళ తర్వాత ‘లైఫ్’ (లవ్ యువర్ ఫాదర్) అనే సినిమాతో మళ్ళీ రీ-ఎంట్రీ ఇస్తున్నారు. మనీషా ఆర్ట్స్, అన్నపరెడ్డి స్టూడియోస్ బ్యానర్స్ పై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, రామస్వామి రెడ్డి నిర్మాతలుగా పవన్ కేతరాజు దర్శకత్వంలో ఈ లైఫ్ (లవ్ యువర్ ఫాదర్) సినిమా రాబోతుంది. శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా SP చరణ్, నవాబ్ షా, ప్రవీణ్, భద్రం, రఘుబాబు, షకలక శంకర్, రియా.. వంటి నటీ నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాకు సీనియర్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా MLA మల్లా రెడ్డి గారు వచ్చారు.

ఈ సందర్బంగా హీరో శ్రీహర్ష మాట్లాడుతూ.. మల్లా రెడ్డి గారు ఈ సినిమాలో నటించి ఉంటే బాగుండని కోరారు. ఈ సందర్బంగా తన తల్లి దండ్రులను గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాని నిర్మించిన తన తండ్రి రామ స్వామి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సినిమాని ఇంత అద్భుతంగా తీసిన డైరెక్టర్ పవన్ కేతరాజుకి ఎంతో రుణపడి ఉంటాననని అన్నారు. మణిశర్మ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ తన సినిమాకి సంగీతం ఇవ్వడం తన అదృష్టమని అన్నారు. అలాగే సింగర్ SP చరణ్, నటుడు ప్రవీణ్ తో కలిసి పని చెయ్యడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అలాగే ఈ సినిమాలో తనతో పని చేసిన కో స్టార్స్ కి కృతజ్ఞతలు తెలిపారు.

MLA మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమాని పాన్ ఇండియా భాషల్లో తీశారని తెలిసి ఆశ్చర్యపోయా అన్నారు. హీరో శ్రీహర్ష తమిళ హీరో విజయ్ కంటే స్మార్ట్ గా ఉన్నారని అన్నారు. శ్రీహర్ష తమ కాలేజీ స్టూడెంట్ అని, వాళ్ళ తండ్రి తమ కాలేజీ ప్రిన్సిపాల్ అని, వీళ్ళు సినిమా చెయ్యడం తనకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. అలాగే ఈ సినిమాలో పని చేసిన నటినటులకి అభినందనలు తెలిపారు. డైరెక్టర్ ప్రవీణ్ కేతరాజుని ఇంత అద్భుతమైన సినిమా తీసినందుకు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సినిమా కచ్చితంగా చాలా పెద్ద హిట్ అవ్వాలని, ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించి పాన్ ఇండియా హిట్ చెయ్యాలని MLA మల్లా రెడ్డి కోరారు.

డైరెక్టర్ పవన్ మాట్లాడుతూ.. ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే చరణ్ ఈ సినిమా చేయబట్టే చాలా అద్భుతంగా వచ్చిందన్నారు. బాల సుబ్రహ్మణ్యం గారు చరణ్ గారిని మనకు గిఫ్ట్ గా ఇచ్చారని ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తారు. సినిమాలో చరణ్ గారి ప్రతి షాట్ ఎంజాయ్ చేశానని అన్నారు. చరణ్ గారు ఇచ్చిన కోపరేషన్ వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది అన్నారు. ఈ సినిమాకి పని చేసిన సీనియర్ టెక్నీషియన్స్ శ్యామ్, మణిశర్మ కి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి టాప్ టెక్నీషియన్స్ తో పని చెయ్యడం తనకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.

నిర్మాత కిషోర్ మాట్లాడుతూ.. LYF సినిమాని ప్రేక్షకులు ఆశీర్వదించాలని కోరారు. మణిశర్మ గారికి, SP చరణ్ గారికి ఇంకా ఈ సినిమా కోసం పని చేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులకి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా డైరెక్టర్ పవన్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. పవన్ సినిమాని చాలా బాగా తీశారని, ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుందని అన్నారు.

ఈ సినిమాలో చత్రపతి శేఖర్, రఘు బాబు, భద్రం, షకలక శంకర్, శాంతి కుమార్, బంటి తదితరులు యాక్ట్ చేయగా, అన్నపరెడ్డి స్టూడియోస్, మనిషా ఆర్ట్స్ & ప్రై.లి బ్యానర్లపై ఈ మూవీ రానుంది. శంకర్ చిడిపల్లి ఆర్ట్ అందించిన ఈ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా భావన పోలేపల్లి వర్క్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు