సమీక్ష : “మా ఊరి పొలిమేర 2” – ట్విస్టులతో సాగే క్రైమ్ థ్రిల్లర్!

Polimera2 Movie Review in Telugu

విడుదల తేదీ : నవంబర్ 03, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, రవి వర్మ, చిత్రం శ్రీను, రాకేందు మౌళి, సాహితి దాస‌రి, అక్ష‌త శ్రీనివాస్‌ తదితరులు

దర్శకుడు : డాక్టర్‌ అనిల్ విశ్వనాథ్‌

నిర్మాత: గౌరీ కృష్ణ

సంగీతం: జ్ఞాని

సినిమాటోగ్రఫీ: కుశిదర్ రమేష్ రెడ్డి

ఎడిటర్: శ్రీ వర

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సమయంలోనే ఈ సినిమాకు సీక్వెల్ ప్రకటించారు మేకర్స్. ఈ క్రమంలో నేడు మా ఊరి పొలిమేర 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం

 

కథ :

 

కొమురయ్య(సత్యం రాజేష్) తన తొలి ప్రేయసి కవితతో కలిసి కేరళకు పారిపోతాడు. మరోవైపు జంగయ్య (బాలాదిత్య) తన సోదరుడు కొమురయ్య కోసం వెతుకులాటలో ఉంటాడు. ఇంతలో కొత్త ఎస్‌ఐ రవీంద్ర నాయక్ (రాకేందు మౌళి) ఆ గ్రామం చుట్టూ ఉన్న రహస్యాలను ఛేదించడానికి జాస్తిపల్లికి వస్తాడు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి ?, ఈ మధ్యలో ఆ గ్రామంలోని పాడుబడిన ఆలయంలోకి ప్రవేశించాలని పురావస్తు శాఖ ఎందుకు భావిస్తోంది ?, అసలు గ్రామంలో వరుస మరణాలకు కొమురయ్య ఎందుకు కారణం అయ్యాడు?, ఇంతకీ ఆ గుడిలో ఏముంది?, జంగయ్య తన సోదరుడిని గుర్తించాడా ?, లేదా ?, చివరికి ఏం జరిగింది ? అనేది మిగిలిన కథ. మూడో పార్ట్ కి లీడ్ ఎలా ఇచ్చారు అనేది ఈ కథ ముగింపు.

 

ప్లస్ పాయింట్స్ :

 

మా ఊరి పొలిమేర 2లో ప్రధానంగా పార్ట్ 1 – పార్ట్ 2ని లింక్ అప్ చేసే సీన్స్ మెప్పించాయి. అలాగే సెకండ్ హాఫ్ లోని కొన్ని థ్రిల్లింగ్ ట్విస్టులు బాగున్నాయి. సినిమాకి జ్ఞాని అందించిన బీజీఎమ్ అదిరిపోయింది. మెయిన్ ట్విస్ట్ లతో పాటు క్లైమాక్స్ ట్విస్ట్ కూడా అదిరిపోయింది. ఇక నిధి చుట్టూ జరిగిన డ్రామా లోని ఎలివేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా నటించిన సత్యం రాజేష్ తన పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించాడు. తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడు. అలాగే, కీలక పాత్రలో నటించిన కామాక్షి భాస్కర్ల కూడా చాలా బాగా నటించింది. ఆమె హావ భావాలు కూడా బాగానే అలరించాయి.

గెటప్ శ్రీను కూడా ఆకట్టుకున్నాడు. బాలాదిత్య పాత్రకు ఈ రెండో పార్ట్ లో ఎక్కువ స్కోప్ దొరకలేదు. కానీ, క్లైమాక్స్ లో బాలాదిత్య పాత్రను ఎలివేట్ చేసిన విధానం బాగుంది. రవి వర్మ, చిత్రం శ్రీను, రాకేందు మౌళి తమ పాత్రలకు న్యాయం చేశారు. సాహితి దాస‌రి, అక్ష‌త శ్రీనివాస్‌ లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ లో కొన్ని భావోద్వేగ సన్నివేశాలను దర్శకుడు బాగానే తీశాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో రివీల్ అయ్యే సీన్స్ ను తెరకెక్కించడంలో అతను సక్సెస్ అయ్యాడు.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ రెండో పార్ట్ మొత్తం ఏ పాయింట్ చుట్టూ తిరుగుతూ ఉంటుందో.. ఆ పాయింట్ కి సరైన ఎండింగ్ ఇవ్వకపోవడం అసలు బాగాలేదు. మూడో పార్ట్ కి లీడ్ కూడా అంత గొప్పగా ఏమీ లేదు. ఇక కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగడం, అలాగే మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ని క్లారిటీగా ఎలివేట్ చేయకుండా పూర్తి సస్పెన్స్ పాయింటాఫ్ వ్యూలో స్క్రీన్ ప్లేని సాగతీయడంతో.. మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం, దీనికి తోడు సత్యం రాజేష్ క్యారెక్టర్ కి ఇచ్చిన ఓవర్ ఎలివేషన్స్ కూడా బాగాలేదు.

అయితే దర్శకుడు డాక్టర్‌ అనిల్ విశ్వనాథ్‌ దర్శకత్వ పనితనం సినిమా పై ఆసక్తిని కలిగించినప్పటికీ… అదే విధంగా ఆయన రాసుకున్న కాన్సెప్ట్, కొన్ని సన్నివేశాలు మరియు క్లైమాక్స్ సీన్స్ బాగున్నప్పటికీ.. కథ కథనాలు మరీ స్లోగా సాగడం మాత్రం అస్సలు బాగాలేదు. ఇక కొన్ని సీన్స్ సరిగ్గా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వవు. దర్శకుడు సినిమాని ఇంట్రెస్టింగ్ గా మొదలు పెట్టి.. ఆ తర్వాత అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశాడు. మొత్తానికి ఈ రెగ్యులర్ ఎమోషనల్ క్రైమ్ స్టోరీలో కొన్ని క్రైమ్ సీన్స్, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదు.

 

సాంకేతిక విభాగం :

 

సినిమాలో చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా.. కథ కథనాలు ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. ఇక సంగీత దర్శకుడు జ్ఞాని సమకూర్చిన నేపథ్యం సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకోగా.. కెమెరామెన్ కుశిదర్ రమేష్ రెడ్డి ,వాటిని తెరకెక్కించిన విధానం మాత్రం ఆకట్టుకుంది. ఎడిటింగ్ బాగుంది. ఈ చిత్ర నిర్మాత గౌరీ కృష్ణ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

తీర్పు :

 

‘మా ఊరి పొలిమేర 2’ అంటూ వచ్చిన ఈ క్రైమ్ ఎమోషనల్ సస్పెన్స్ డ్రామాలో నటీనటుల నటన అండ్ ప్లే లోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మరియు కొన్ని భావోద్వేగ సన్నివేశాలు బాగున్నాయి. కానీ, కథ కథనాలు స్లోగా సాగడం, కథకు అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. మొత్తమ్మీద ఈ సినిమాలోని థ్రిల్లింగ్ ట్విస్టులు, కొన్ని క్రైమ్ సీన్స్, క్లైమాక్స్ లోని ఎమోషన్స్ బాగానే కనెక్ట్ అవుతాయి.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version