ప్రముఖ టాలివుడ్ నటి హేమను బెంగళూరు పోలీసులు రేవు పార్టీలు డ్రగ్స్ తీసుకుందని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని మీడియాకి అప్పుడే వెల్లడించడం జరిగింది. అయితే మా అసోసియేషన్ మాత్రం నటి హేమ ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొన్ని నిరాధార ఆరోపణలు మరియు వార్తల కారణంగా ఇలా సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదు అని వెల్లడించిన సంగతి తెలిసిందే.
తాజాగా మా అసోసియేషన్ నటి హేమ పై సస్పెన్షన్ ను ఎత్తివేసింది. మా అధ్యకుడు మంచు విష్ణు సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ తీసుకున్న నిర్ణయానికి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం తెలిపింది. అయితే తను ఎటువంటి డ్రగ్స్ తీసుకోలేదని, ల్యాబ్ లో పరీక్షలు చేయించుకున్నట్లు నివేదికలను పంపడం జరిగింది. తనకి మా అసోసియేషన్ సపోర్ట్ చేయాలని, ఒక లేఖతో పాటుగా, మెడికల్ సర్ఫిటికెట్ లను పంపడంతో మా ఆమోదం తెలిపింది. ఇదే విషయాన్ని మా అసోసియేషన్ తాజాగా ప్రకటించడం జరిగింది.