“మా నాన్న సూపర్ హీరో” టీజర్ లాంఛ్ ఈవెంట్ డీటైల్స్ ఇవే!

“మా నాన్న సూపర్ హీరో” టీజర్ లాంఛ్ ఈవెంట్ డీటైల్స్ ఇవే!

Published on Sep 11, 2024 4:32 PM IST

టాలీవుడ్ నటుడు సుధీర్ బాబు చివరిసారిగా హరోం హర చిత్రంలో కనిపించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. తదుపరి లూజర్ ఫేమ్ డైరెక్టర్ అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కుతున్న మా నాన్న సూపర్ హీరోలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా, ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే టీజర్ రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ టీజర్ లాంఛ్ ఈవెంట్ కి సంబంధించిన డీటైల్స్ ను మేకర్స్ నేడు సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. రేపు సాయంత్రం 4:00 గంటలకు RK సినీప్లెక్స్ స్క్రీన్ 2 లో ఈ ఈవెంట్ జరగనుంది. ఈ చిత్రంలో ఆర్నా హీరోయిన్ గా నటిస్తుండగా, సాయి చంద్, షాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని కీలక పాత్రల్లో నటించారు. క్యామ్ ఎంటర్టైన్మెంట్‌తో కలిసి వి సెల్యులాయిడ్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి జై క్రిష్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ఈ దసరా పండుగ సందర్భంగా థియేటర్లలోకి రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు