సెన్సార్ ముగించుకున్న ‘మా నాన్న సూపర్ హీరో’

సెన్సార్ ముగించుకున్న ‘మా నాన్న సూపర్ హీరో’

Published on Oct 3, 2024 10:29 PM IST

నవదళపతి సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’ దసరా కానుకగా గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సినిమాను పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ రూపొందించింది. ఈ సినిమాలో తండ్రీకొడుకుల బంధం గురించిన ఎమోషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

ఇక ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ ‘యు’ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ‘మా నాన్న సూపర్ హీరో’ కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా అని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేశాయి.

ఈ సినిమాలో షాయాజి షిండే, సాయిచంద్, ఆమని తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జేయ్ క్రిష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అభిలాష్ కంకర డైరెక్ట్ చేయగా.. వి సెల్యులాయిడ్ – సునీల్ బలుసు ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు