సమీక్ష: మా నాన్న సూపర్ హీరో – ఆకట్టుకునే ఎమోషనల్ డ్రామా

Maa Nanna Superhero Movie Review in Telugu

విడుదల తేదీ : అక్టోబర్ 11, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : సుధీర్ బాబు, ఆర్నా వోహ్రా, సాయి చంద్, షయాజీ షిండే, ఝాన్సీ, శశాంక్

దర్శకుడు : అభిలాష్ కంకర

నిర్మాత : సునీల్ బలుసు

సంగీత దర్శకుడు : జై క్రిష్

సినిమాటోగ్రఫీ : సమీర్ కళ్యాణి

ఎడిటర్ : కుమార్ పి

సంబంధిత లింక్స్: ట్రైలర్


ఈ వారం దసరా కానుకగా థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు నటించిన ఎమోషనల్ డ్రామా ‘మా నాన్న సూపర్ హీరో” కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎంత మేర ఆకట్టుకుందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ఇక కథలోకి వస్తే.. తన చిన్న వయస్సులోనే నాన్న ప్రకాష్ (సాయి చంద్)ని దూరం చేసుకున్న జాని(సుధీర్ బాబు) ఓ అనాథాశ్రమంలో పెరుగుతాడు. అయితే తనని గొప్ప కుటుంబానికి చెందిన వ్యక్తి (షయాజి షిండే) దత్తత తీసుకుంటాడు. కానీ ఆ తర్వాత తన జీవితంలో జరిగే నష్టాలు జాని వల్లే అని నమ్మి మాట్లాడ్డం మనేస్తాడు. కానీ నాన్న అంటే అమితమైన ప్రేమ ఉన్న జాని తన తండ్రి చేసిన అన్ని అప్పులు, తప్పులు సరిదిద్దుతూ వస్తాడు. ఈ క్రమంలో షయాజిని పోలీసులు జైల్లో వేస్తారు. దీనికి కారణం ఏంటి? తను బయటకి రావాలంటే జానికి 1 కోటి రూపాయలు అవసరం అవుతాయి. వాటి కోసం తాను ఏం చేస్తాడు? ఈ క్రమంలో తనకి పరిచయమైన కొత్త వ్యక్తులు ఎవరు? తన నాన్నకి సంబంధించిన ఎలాంటి నిజాలు తెలుసుకుంటాడు? ఇంతకీ తన నాన్నని బయటకి తీసుకొస్తాడా లేదా అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్స్ పై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

ఈ మధ్య కాలంలో తెలుగు, తమిళ భాషల్లో కొన్ని మంచి సినిమాలు వచ్చాయి. వాటి సరసన ఈ సినిమా కూడా నిల్చుంటుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఈ సినిమాలో ఎమోషనల్ పార్ట్ చాలా బాగా వర్కౌట్ అయ్యింది. ప్రతి ఎమోషనల్ బిట్ కూడా ఆడియెన్స్‌ని ఎంతగానో కదిలిస్తుంది. మరి వీటితో పాటు సుధీర్ బాబు ఒక నటుడిగా తనని మరింత ఇంప్రూవ్ చేసుకుంటున్నాడని చెప్పాలి.

తన నేచురల్ పెర్ఫార్మన్స్ ఈ సినిమాలో చాలా బాగుంది. అలాగే ఆయనతో పాటు నటుడు షయాజి షిండే తన రోల్‌లో పర్ఫెక్ట్‌గా చేశారు. సుధీర్ బాబు, షయాజిల నడుమ పలు సన్నివేశాలు బాగున్నాయి. ఇక సినిమాలో సర్‌ప్రైజింగ్ ప్యాక్‌గా ఎవరైనా ఉన్నారంటే అది నటుడు సాయి చంద్ అని చెప్పొచ్చు. తన పాత్రకు సినిమా టైటిల్‌కి సరైన న్యాయం చేశారు.

మెయిన్‌గా సెకండాఫ్‌లో ఓ సన్నివేశం అయితే చప్పట్లు కొట్టిస్తుంది. అంత బాగా చేశారు. అలాగే తన కామెడీ టైమింగ్, సుధీర్ బాబుతో పలు సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే సినిమా క్లైమాక్స్‌కి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒక ఎమోషనల్ ముగింపునివ్వడం చాలా బాగుంది.

ఇక వీటితో పాటుగా హీరోయిన్ ఆర్నా వోహ్రా బాగుంది. క్యూట్ లుక్స్‌తో ఉన్న కాసేపు డీసెంట్ నటనతో ఆకట్టుకుంటుంది. అలాగే సెకండాఫ్ లో నటుడు కొరియోగ్రాఫర్ రాజు సుందరం రోల్ బాగుంది. ఇక వీరితో పాటుగా ఇతర నటీనటులు శశాంక్, దేవి ప్రసాద్, హర్షవర్ధన్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలో మరీ అంత కొత్త లైన్‌ని మనం ఆశించలేం. కొంచెం రెగ్యులర్ లైన్‌తోనే సినిమా కనిపిస్తుంది. అలాగే సినిమా స్టార్టింగ్ కొంచెం స్లోగా ఉందని చెప్పాలి. సో కొంచెం సినిమా పికప్ అవ్వడానికి సమయం తీసుకుంది. అలాగే ఆ తర్వాత కొంతసేపటికే జరిగే సన్నివేశాలు చూస్తే కొంతమేర మనం సినిమాని ఊహించేయవచ్చు.

అంతే కాకుండా డీసెంట్ ఫస్టాఫ్ తర్వాత ఒక టెన్స్ వాతావరణం ఏర్పడుతుంది. కానీ దానిని అలా కంటిన్యూ చేయకుండా ఒక ఫన్ టోన్‌లో కొంతమేర నడిపించడం ఆ ఎమోషన్‌ని కొంచెం పక్కదారి పట్టించినట్టుగా అనిపిస్తుంది. ఇంకా సెకండాఫ్‌లో కొన్ని సీన్స్, కథనం కొంచెం ‘వేదం’ సినిమాలో అల్లు అర్జున్ స్టోరీని తలపించవచ్చు. అలాగే కొంత సమయం తర్వాత హీరోయిన్ కి పెద్దగా ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. వీటితో కొన్ని సీన్స్ మాత్రం రెగ్యులర్‌గానే అనిపిస్తాయి.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. అలాగే టెక్నికల్ టీంలో మ్యూజిక్ వర్క్ ఇంప్రెసివ్‌గా ఉంది. కథనంలో కొన్ని సాంగ్స్ హత్తుకునేలా ఉన్నాయి. జై క్రిష్ ఇచ్చిన నేపథ్య సంగీతం కూడా బాగుంది. సమీర్ కల్యాణి బ్యూటిఫుల్ విజువల్స్‌ని ఈ సినిమాకి అందించారు. అలాగే అనీల్ కుమార్ పి ఎడిటింగ్ పర్వాలేదు. సినిమాలో కొన్ని డైలాగ్స్ బాగున్నాయి.

ఇక దర్శకుడు అభిలాష్ కంకర విషయానికి వస్తే.. తను ఓటీటీలో లూజర్ సిరీస్‌తో మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఆ సిరీస్ లో ఎంత సెన్సిబుల్ ఎమోషన్స్ ని తను పండించారో ఈ సినిమాలో కూడా ఎమోషన్స్ పరంగా ఒక బ్యూటిఫుల్ వర్క్‌ని అందించారని చెప్పాలి. లైన్ కొత్తదే కాకపోవచ్చు.. దానిని తాను ఆవిష్కరించిన విధానం మాత్రం మెప్పిస్తుంది. కీలకమైన ఎమోషన్స్‌ని తను చూపించిన విధానం, ఒక క్లారిటీ ఎండింగ్ సినిమాలో బాగా వర్కౌట్ అవుతాయి. కాకపోతే కొన్ని సీన్స్ మాత్రం రెగ్యులర్‌గా అనిపిస్తాయి.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే.. “మా నాన్న సూపర్ హీరో” దసరా బరిలో వచ్చి ఆడియెన్స్‌కి ఒక మంచి ఎమోషనల్ రైడ్‌ని అందిస్తుందని చెప్పవచ్చు. లైన్ కొత్తగా అనిపించకపోవచ్చు కానీ సుధీర్ బాబు, సాయి చంద్ పాత్రలు సహా సినిమాలో ఎమోషన్స్ మిమ్మల్ని ఏమాత్రం డిజప్పాయింట్ చేయవు. ఫ్యామిలీ ఆడియెన్స్‌కి ఇంట్లో ప్రతీ తండ్రీ కొడుకలకి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. కొన్ని రెగ్యులర్ సీన్స్‌ని మినహాయిస్తే, ఈ పండగకి ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి ఈ సినిమాను చూడొచ్చు.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version