‘మా నాన్న సూపర్ హీరో’ ట్రైలర్ రిలీజ్‌కి డేట్ ఫిక్స్

‘మా నాన్న సూపర్ హీరో’ ట్రైలర్ రిలీజ్‌కి డేట్ ఫిక్స్

Published on Oct 2, 2024 11:00 PM IST

నవదళపతి సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మా నాన్న సూపర్ హిట్’ షూటింగ్ పనులు ముగించుకుని దసరా బరిలో రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సినిమాను అభిలాష్ కంకర పూర్తి ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఇఫ్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేశాయి.

అయితే, ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాలో తండ్రీకొడుకుల మధ్య సాగే ఎమోషన్ ప్రతిఒక్కరికీ నచ్చుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ చిత్ర ట్రైలర్‌ను అక్టోబర్ 5న గ్రాండ్ లాంచ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాలో షాయాజి షిండే, ఆమని, సాయి చంద్, రాజు సుందరం తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జేయ్ క్రిష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. అక్టోబర్ 11న ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు