‘మారి 2’ విడుదల తేదీ ఖరారు !

‘మారి 2’ విడుదల తేదీ ఖరారు !

Published on Nov 5, 2018 11:27 PM IST

తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన ‘మారి 2’ చిత్రం యొక్క విడుదల తేది ఖరారు అయ్యింది. ఈచిత్రం ఈ డిసెంబర్ 21 న విడుదల కానుందని సమాచారం. ఇక ఇటీవల ఇక ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా తాజాగా ఈ రోజు సాయంత్రం 6గంటలకు ఈ చిత్రం నుండి రెండవ పోస్టర్ విడుదలకానుంది. బాలాజీ మోహన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సూపర్ హిట్ చిత్రం ‘మారి’ కి సీక్వెల్ గా వస్తుండంతో ఈ చిత్రం ఫై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈచిత్రంలో ధనుష్ సరసన ‘ఫిదా’ ఫేమ్ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది.

యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ధనుష్ సొంత చిత్ర నిర్మాణ సంస్థ వుండెర్ బార్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది. ఇక ఇంతకుముందు మారి తెలుగులో ‘మాస్’ పేరుతో విడుదల కావడంతో ‘మారి 2’కూడా తెలుగులోనూ విడుదలకానుంది. అయితే ఈ చిత్రం డిసెంబర్ 21 న అక్కడ విడుదల కావడం కష్టమే ఎందుకంటే అదే రోజు తెలుగులో ‘అంతరిక్షం , యాత్ర , పడి పడి లేచె మనసు’ చిత్రాలు విడుదలవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు