ఇంటర్వ్యూ : హీరో నితిన్ – ‘మాచర్ల నియోజకవర్గం’ అందరికీ నచ్చే మాస్ యాక్షన్ హిలేరియస్ ఎంటర్టైనర్

Published on Aug 10, 2022 1:00 am IST

నితిన్ హీరోగా కృతి శెట్టి, క్యాథరీన్ త్రెసా హీరోయిన్స్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మాచర్ల నియోజకవర్గం. నిఖితా రెడ్డి, సుధాకర్ రెడ్డి కలిసి శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ పై మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ అన్ని కూడా మూవీ పై మరింతగా అంచనాలు పెంచేసాయి. నితిన్ ఈ మూవీలో సిద్దార్ధ రెడ్డి అనే ఐఏఎస్ అధికారి పాత్ర చేస్తుండగా సముద్రఖని నెగటివ్ రోల్ చేస్తున్నారు. మాస్ యాక్షన్ తో కూడిన హిలేరియస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మాచర్ల నియోజకవర్గం మూవీ ఆగష్టు 12న విడుదల కానున్న సందర్భంగా హీరో నితిన్ ప్రత్యేకంగా మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు.

 

చాలా గ్యాప్ తరువాత మంచి మాస్ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్నారు కదా ఏదైనా స్ట్రాటజీ ఉందా ?

నేను ఇండస్ట్రీలో ఇరవై ఏళ్ళ నుండి ఉన్నాను,కెరీర్ పరంగా ఎక్కువగా ప్రేమ కథలు చేసి ఒకింత బోర్ గా అనిపించింది. కెరీర్ లో ఇకపై డిఫరెంట్ గా కూడా మూవీస్ చేయాలనే ఆలోచనతో మాచర్ల మూవీ చేశాను. ఇది పక్కాగా సాగే మాస్ కమర్షియల్ ఎంటెర్టైనర్ మూవీ. అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకోవడంతో పాటు ఇందులో నా రోల్ ఎంతో పవర్ఫుల్ గా ఉంటుంది.

 

మాచర్ల లో ఉండే కొత్తదనం ఏమిటి ?

నిజానికి గతంలో వచ్చిన పొలిటికల్ జానర్ మూవీస్ కి ఇది కొంత భిన్నంగా ఉంటుంది. మధ్యలో పలు కమర్షియల్ అంశాలు ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి. ఇది పక్కాగా కమర్షియల్ జానర్ లో సాగె పొలిటికల్ డ్రామా మూవీ. అలానే సినిమాలో తీసుకున్న పాయింట్ కూడా అందరినీఅలరిస్తుంది .

 

ఈ మూవీలో మిమ్మల్ని ఆకట్టుకున్న పాయింట్ ఏమిటి ?

మూవీ కథ ఎంతో యూనిక్ గా ఉంటుంది. అలానే నా కెరీర్ లో ఫస్ట్ టైం ఈ మూవీలో ఐఏఎస్ అధికారి పాత్ర చేస్తున్నాను. అలానే నా పాత్ర ఎంతో పవర్ఫుల్ గా ఉండడంతో పాటు మంచి ఎంటర్టైనింగ్ గా కూడా సాగుతుంది. పాటలు, ఫైట్స్, కామెడీ, యాక్షన్ ఇలా అన్ని అంశాలు పక్కాగా మిళితమైన మూవీ. ఫ్యాన్స్ కి మాత్రమే కాదు అన్నివర్గాల ఆడియన్స్ ని మాచర్ల ఆకట్టుకుంటుందని నాకు నమ్మకం.

 

ఎడిటర్ గా వర్క్ చేసిన రాజశేఖర్ రెడ్డి దీనికి డైరెక్షన్ కూడా చేయగలరని మీరు ఎలా నమ్మారు ?

నిజానికి నేను 2017లో చేసిన లై మూవీ సమయంలో ఆయన ఎడిటింగ్ వర్క్ నాకు ఎంతో బాగా నచ్చింది. కొన్ని సన్నివేశాలు అయితే మరింతగా నచ్చాయి. మీలో మంచి టాలెంట్ ఉంది, మీరు దర్శకుడు ఎందుకు కాకూడదు అని అభిప్రాయపడ్డాను. అనంతరం తాను కూడా ఒకింత ఆలోచన చేసి, ఆపై కోవిడ్ సమయంలో ఈ స్టోరీ రాసుకుని నాకు చెప్పారు. కథ విన్న వెంటనే ఎంతో బాగుందనిపించింది ఇమీడియట్ గా ఓకె చెప్పేసాను.

కొత్త దర్శకులతో కొంత ఇబ్బంది ఉంటుంది కదా, చెప్పిన కథని పక్కాగా స్క్రీన్ పై చూపించారా ?

రాజశేఖర్ స్వతహాగా ఎడిటర్ కావడంతో షాట్ కటింగ్స్, సీన్ ఓపెనింగ్స్ లెంగ్త్ వంటి విషయాల్లో ఎంతో కేర్ తీసుకున్నారు. అలానే ముఖ్యంగా ఏదైతే స్టోరీ చెప్పారో పక్కాగా అదే స్క్రీన్ పై తీశారు. అలానే చాలా వరకు వృధా తగ్గింది. నిజానికి ఈ మూవీలో అనేకమంది నటీనటులు ఉన్నారు, వారందరినీ హ్యాండిల్ చేయడం ఒకింత కష్టం అయినప్పటికీ ఆయన ఎంతో అనుభవం ఉన్న దర్శకుడి మాదిరిగా మూవీలో ప్రతి పాత్రని ఎంత బాగా చూపించారు.

 

దర్శకుడు శేఖర్ మీ ఫ్రెండ్ కదా, మరి స్టోరీ సినిమా విషయంలో ఎటువంటి శ్రద్ధ తీసుకున్నారు ?

నిజానికి శేఖర్ డైరెక్టర్ గా మెగా ఫోన్ పట్టడం అంటే ఒక ఫీల్డ్ నుండి మరొక ఫీల్డ్ కి రావడమే. అందుకే ఒకవేళ ఇందులో ఫెయిల్ అయితే మళ్ళి అక్కడికి వెళ్ళవలసిందే. అది జరుగకూడదు అంటే కష్టపడి పని చేయాలి. అందుకే ఎంతో పక్కాగా శ్రద్దగా ఈ మూవీ తీశారు. నాకంటే కూడా తనకే ఈ మూవీ సక్సెస్ ఎంతో ఉపయోగం ఉంటుంది .

 

ఐఏఎస్ పాత్ర కోసం ఏదైనా హోమ్ వర్క్ చేయడం, మేకోవర్ విషయంలో శ్రద్ద తీసుకోవడం జరిగిందా ?

ఈ విషయంలో దర్శకుడు శేఖర్ ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. మధ్యలో పలు సందర్భాల్లో పలువురు ఐఏఎస్ అధికారులని కలవడం వారి నడక, నడత గ్రహించి వారు ఎలాంటి సందర్భాల్లో ఎలా వ్యవహరిస్తారో తెలుసుకోవడం, అలానే ఎప్పుడు వాళ్ళు హుందా ఉంటారు, ఎప్పుడెప్పుడు సరదాగా అలానే హుందాగా వ్యవహరిస్తారు అనేవి తెలుసుకుని వాటిని నా ద్వారా మూవీలో ఇంప్లిమెంట్ చేసారు.

 

ఈ మూవీ రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూఒపొందిందా ? ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సముద్రఖని గారు ఆమాట చెప్పడం జరిగింది కదా ?

నిజానికి ఇది పూర్తిగా ఒక ఫిక్షనల్ స్టోరీ మాత్రమే. ఇక మా దర్శకుడు శేఖర్ గారిది గుంటూరు కావడం అలానే మాచర్ల అనే టైటిల్ లో ఒక ఫోర్స్ ఉండడంతో అందరం దీనినే టైటిల్ గా అనుకున్నాము. ఇక ఈ మూవీ కథని దర్శకుడు సముద్రఖని గారికి వినిపించినపుడు తమిళనాడులో ఆయనకు ఇటువంటి సంఘటన ఉన్నట్లు చెప్పారట.

 

కలెక్టర్ అంటే కొంత సాఫ్ట్ గా ఉంటారు కదా ?

నిజానికి ఐఏఎస్ అధికారులు అంటే క్లాస్ గా ఉంటారని అందరం భావిస్తాం కదా, అందుకే ఒకింత భిన్నంగా ఒకింత మాస్ గా కూడా ఇందులో ఉండేలా చూపించాము.

 

మీ మూవీ ట్రైలర్ లో ఎక్కువగా కమర్షియల్ అంశాలు కనిపిస్తున్నాయి కదా ?

మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం ఎక్కువుగా ఫన్, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ముఖ్యంగా నా పాత్ర తోపాటు వెన్నెల కిషోర్ గారు, రాజేంద్రప్రసాద్ గారి పాత్రల మధ్య వచ్చే కామెడీ బాగుంటుంది. మంచి ఇంటర్వెల్ బ్యాంగ్ తరువాత సెకండ్ హాఫ్ స్టోరీ కొంత మాస్ గా సాగినప్పటికీ మధ్యలో ఫన్ మాత్రం ఉంటుంది. ఓవరాల్ గా ఇది క్లాస్ టచ్ తో సాగె మాస్ మూవీ.

 

మాచర్ల నియోజకవర్గం ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది ?

ఇది మంచి ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ అండి. ఇందులో యాక్షన్, కామెడీ, రొమాన్స్, మాస్, క్లాస్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ అంశాలు అన్ని ఉంటాయి. ఫ్యామిలీస్ బాగా ఎంజాయ్ చేస్తారు.

 

క్యాథరీన్ పాత్రలో ఏదైనా సర్ప్రైజ్ ఉందా ?

ఆమె పాత్ర సినిమాలో చిన్నదే అయినప్పటికీ మూవీ లో ఎంతో కీలకం, మంచి ప్రాధాన్యత కలిగిన పాత్ర ఆమెది.

 

మాచర్ల లో మీ పాత్రకు సవాల్ గా అనిపించిన అంశాలు ?

నేను చాలా గ్యాప్ తరువాత చేసిన మాస్ యాక్షన్ ఫిలిం ఇది. నా స్టైలింగ్,, డ్రెసింగ్, లుక్స్ విషయంలో బాగా శ్రద్ధ తీసుకున్నాను.

 

కృతి శెట్టి ని స్మార్ట్ అన్నారు కదా ?

అవును ఆమె ప్రతి విషయం ఎంతో లాజికల్ గా థింక్ చేస్తూ మమ్మల్ని అడుగుతుంది. నిజానికి హీరోయిన్స్ కి ఉండాల్సిన మంచి క్వాలిటీ అది. అందుకే తనని స్మార్ట్ అని అన్నాను.

 

మహతి స్వరసాగర్ మ్యూజిక్ గురించి చెప్పండి ?

తనకి నాకు మంచి సింక్ ఉంటుంది. నాకు ఇప్పటివరకు మంచి సాంగ్స్ ఇచ్చాడు. ఈ మూవీ సాంగ్స్ కూడా అదరగొట్టాడు. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే మరింతగా సూపర్. ఆ విషయంలో ఆయన తండ్రి మణిశర్మ నే మించిపోయాడు మహతి.

 

విక్రమ్ మూవీ విషయంలో మీ సలహా ఉందని మీ నాన్న చెప్పారు ?

ఆ మూవీ కొనమని చెప్పాను అంతే. రేట్స్ గురించి నాకు తెలియదు. ఆ మూవీ చూసి దాదాపుగా వారం రోజులు నిద్రపట్టలేదు. ఒక మూసలో వెళ్తున్న సినిమాలని కేవలం ఒక మంచి పాయింట్ తీసుకుని దానిని ఆడియన్స్ ని ఆకట్టుకునేలా అద్భుత కథనంతో దర్శకుడు లోకేష్ నడిపించిన తీరు అద్భుతం. అలానే భవిష్యత్తులో అటువంటి బలమైన కథ వస్తే తప్పకుండా చేస్తాను.

 

ఇరవై ఏళ్ళ సినిమా ప్రయాణం ఎలా అనిపించింది ?

ఈ ఇరవై ఏళ్లలో మధ్యలో ఎన్నో హిట్స్, మరికొన్ని ప్లాప్స్ చూసాను. ఇప్పటికి అయితే మంచి ఫామ్ లో ఉన్నాను. తప్పకుండా ఇకపై మరింతగా మంచి సినిమాలు చేసి కెరీర్ పరంగా ఎదగాలని కోరుకుంటున్నాను.

 

వరుసగా మీకు ప్లాప్స్ వచ్చినపుడు బలంగా నిలబడాలి అనే స్ఫూర్తిని ఇచ్చింది ఎవరు ?

ఇండియాలో ఎక్కువ ప్లాప్స్ వచ్చిన నటులు ఎవరు అని గూగుల్ చేసేవాడిని. హృతిక్ రోషన్,అక్షయ్ కుమార్ ల పేర్లు వచ్చేవి. వారిని వారి కెరీర్ ని చూసి ఎంతో నేర్చుకున్నాను. అలానే మధ్యలో నాపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. వాటిని పాజిటివ్ గా తీసుకుని గుండెధైర్యంతో ముందుకు సాగాను.

 

రానురాను సాంగ్ రీమిక్స్ ఆలోచన ఎవరిది ?

నిజానికి ఈ ఆలోచన నాదే. ఏదైనా సాంగ్ రీమిక్స్ చేద్దాం అని అనుకున్నపుడు జయం మూవీలో ఈ సాంగ్ అప్పట్లో పెద్ద అప్లాజ్ అందుకుంది కదా అందుకే రీమిక్స్చేసాము ఇరవై ఏళ్ళు గడిచినా సాంగ్ కి వచ్చిన రెస్పాన్స్ మాత్రం తగ్గనే లేదు. ఇక ఈ మూవీలో మొత్తం మూడు సాంగ్స్ కి డాన్స్ చేశాను. అందరికీ నచ్చుతాయి.

 

పాన్ ఇండియా మూవీ చేసే ఆలోచన ఉందా ?

పాన్ ఇండియా మూవీ చేయాలనీ అనుకుని చేస్తే కుదరదు. అటువంటి అప్పీల్ ఉన్న స్టోరీ దొరకాలి. ఒకవేళ నా దగ్గరకి అటువంటి కథ వస్తే చేయడానికి సిద్ధం.

 

ఈ మూవీ షూట్ ఎక్కువగా ఎక్కడ జరిగింది?

హైదరాబాద్, విశాఖపట్నంలో జరిగింది. అయితే సాంగ్స్ కోసం మాత్రం విదేశాలకు వెళ్లి వచ్చాము. ప్రసాద్ మురెళ్ళ గారు మూవీకి అందించిన ఫొటోగ్రఫి, ముఖ్యంగా సాంగ్స్ లో విజువల్స్ అయితే సూపర్ గా ఉంటాయి.

 

నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ?

వక్కంతం వంశీ గారితో ఒక మూవీ చేస్తున్నాను.

ఆల్ ది బెస్ట్ టూ ‘మాచర్ల నియోజకవర్గం’

సంబంధిత సమాచారం :

సంబంధిత సమాచారం :