వరల్డ్ వైడ్ “మ్యాడ్” లేటెస్ట్ వసూళ్లు.!

వరల్డ్ వైడ్ “మ్యాడ్” లేటెస్ట్ వసూళ్లు.!

Published on Oct 11, 2023 12:09 PM IST

లేటెస్ట్ గా టాలీవుడ్ దగ్గర వచ్చిన సాలిడ్ యూత్ ఫుల్ సెన్సేషనల్ హిట్ చిత్రం “మ్యాడ్”. యంగ్ హీరోస్ సంగీత్ శోభన్, రామ్ నితిన్, నార్నె నితిన్ లు హీరోలుగా దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ఇది కాగా యువతని బాగా ఆకట్టుకొని మేకర్స్ పెట్టుకున్న అంచనాలు అయితే ఇది అందుకొని సాలిడ్ వసూళ్లు ఇది అందుకోగా వీక్ డేస్ లో వచ్చాక కూడా ఈ సినిమా అదరగొడుతుంది.

మరి నాలుగు రోజుల్లో 10.2 కోట్ల గ్రాస్ ని అందుకున్న ఈ చిత్రం ఐదవ రోజుకి మరో కోటి రూపాయలకి పైగా గ్రాస్ ని అందుకొని మొత్తం ఐదు రోజుల్లో అయితే 11.6 కోట్ల గ్రాస్ ని ఈ చిత్రం అందుకుంది. మొత్తానికి అయితే ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మంచి రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫర్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు