7 రోజుల్లో 14 కోట్లతో మ్యాడ్!

7 రోజుల్లో 14 కోట్లతో మ్యాడ్!

Published on Oct 13, 2023 7:38 PM IST

నార్నే నవీన్, సంగీత శోభన్, రామ్ నితిన్, గౌరీ ప్రియా, ఆనంతిక, గోపిక ఉదయన్, రఘుబాబు, రచ్చ రవి, మురళీధర్ గౌడ్, విష్ణు ఆంటోనీ, శ్రీకాంత్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో, డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మ్యాడ్. గత శుక్రవారం థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఇప్పటి వరకూ ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 14 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టడం జరిగింది.

సిచువేషనల్ కామెడీ తో సాగే ఈ ఫన్ డ్రామాను సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ సినిమాస్ పతాకాల పై నిర్మించడం జరిగింది. భీమ్స్ సంగీతం అందించిన ఈ చిత్రం లాంగ్ రన్ లో మంచి వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు