టాలీవుడ్‌లో తెరకెక్కిన పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్ సీక్వెల్ మూవీ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేయగా రామ్ నితిన్, నార్నె నితిన్, సంగీత్ శోభన్ మరోసారి ఈ సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో మూవీపై మంచి బజ్ క్రియేట్ చేశాయి.
ఇక ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇందులోని కామెడీ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను అలరించడం ఖాయమని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్‌గా చెబుతుంది. ఇక ఈ సినిమా రన్‌టైమ్‌ను 2 గంటల 7 నిమిషాలకు లాక్ చేశారు. ఇలాంటి షార్ప్ రన్‌టైమ్‌తో ఈ మూవీ రానుండటంతో ప్రేక్షకులకు ఇది బాగా కనెక్ట్ అవుతుందని చిత్ర యూనిట్ చెబుతుంది.
ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మార్చి 28న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.