“మ్యాడ్ స్క్వేర్” నుంచి ముగ్గురు హీరోస్ పై ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్

గత ఏడాది వచ్చిన పలు యూత్ ఫుల్ హిట్ చిత్రాల్లో క్రేజీ కామెడీ రైడ్ చిత్రం “మ్యాడ్” కూడా ఒకటి. మరి యువ నటీనటులు నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక నిపుణులతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రూపొందించిన ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంటుంది అని మేకర్స్ కన్ఫర్మ్ చేసేసారు. మరి అనౌన్సమెంట్ నుంచే మొదటి సినిమా లవర్స్ ఎగ్జైట్ అయ్యారు. ముఖ్యంగా యువత ఈ మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్‌టైనర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాతలు ఒక తీపికబురు చెప్పారు. ఈ చిత్రం నుంచి మొదటి గీతాన్ని సెప్టెంబర్ 20వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ తీపి కబురుని తెలపడమే కాకుండా, సాంప్రదాయ దుస్తులలో ఉన్న మ్యాడ్ గ్యాంగ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది చిత్రం బృందం. ఈ పోస్టర్ లో వారి వేషధారణ, శైలి మొదటి భాగానికి భిన్నంగా ఉంది. మ్యాడ్ గ్యాంగ్ ను సరికొత్తగా పరిచయం చేస్తున్న ఈ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ‘మ్యాడ్ స్క్వేర్‌’ పోస్టర్ ను చూడగానే ఈసారి కొత్త రకమైన ఎంటర్టైన్మెంట్ తో రాబోతున్నట్టుగా అనిపిస్తుంది.

అందరూ మెచ్చుకునేలా ‘మ్యాడ్’ చిత్రాన్ని రూపొందించిన రచయిత, దర్శకుడు కళ్యాణ్ శంకర్.. సీక్వెల్‌ను మరింత వినోదాత్మకంగా మలిచే పనిలో ఉన్నారు. మొదటి భాగాన్ని ఇష్టపడిన ప్రతి ఒక్కరూ, రెండో భాగాన్ని మరింత ఇష్టపడతారని నిర్మాతలు ఎంతో నమ్మకంగా చెబుతున్నారు. రెట్టింపు వినోదంతో, రెట్టింపు విజయాన్ని ఖాతాలో వేసుకుంటామని చిత్ర బృందం చెబుతోంది.

శ్రీకర స్టూడియోస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సూర్యదేవ నాగవంశీ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇక ఈ చిత్రం రిలీజ్ ఏంటి ఇతర అప్డేట్స్ అనేవి మున్ముందు రివీల్ కానున్నాయి.

ఇక ఈ చిత్రానికి సాంకేతిక వర్గం: రచన, దర్శకత్వం: కళ్యాణ్ శంకర్, సమర్పణ: సూర్యదేవ నాగవంశీ, నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కూర్పు : నవీన్ నూలి, ఛాయాగ్రహణం : షామ్‌దత్, కళా దర్శకత్వం: శ్రీ నాగేంద్ర తంగాల, పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్, బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌, శ్రీకర స్టూడియోస్ వారు అందిస్తున్నారు.

Exit mobile version