యూఎస్ లో “మ్యాడ్ స్క్వేర్” మేనియా.. అపుడే లక్ష మార్క్

యూఎస్ లో “మ్యాడ్ స్క్వేర్” మేనియా.. అపుడే లక్ష మార్క్

Published on Mar 25, 2025 9:00 PM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో క్రేజీ మ్యాడ్ రైడ్ చిత్రం మ్యాడ్ స్క్వేర్ కూడా ఒకటి. అయితే ఈ చిత్రాన్ని దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించగా నార్నె నితిన్, సంగీత్ శోభన్ అలాగే రామ్ నితిన్ లు హీరోలుగా నటించారు. ఇక మొదటి పార్ట్ భారీ హిట్ కావడం ఇపుడు పార్ట్ 2 నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా మంచి ప్రామిసింగ్ గా ఉండడంతో మ్యాడ్ స్క్వేర్ పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

మరి ఇలా యూఎస్ మార్కెట్ లో ఇంకా రిలీజ్ కాకుండానే ప్రీసేల్స్ లో ఈ చిత్రం అదరగొడుతుంది అని చెప్పాలి. లేటెస్ట్ గా ఈ సినిమా అక్కడ ఆల్రెడీ లక్ష డాలర్స్ మార్క్ ని దాటినట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. దీనితో ఈ సినిమా కోసం అక్కడ ఆడియెన్స్ ఎలా ఎదురు చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించగా ఈ మార్చ్ 28న గ్రాండ్ గా ఈ చిత్రం రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు