టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ నార్నె నితిన్ అలాగే సంగీత్ శోభన్, రామ్ నితిన్ లు హీరోలుగా దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన లేటెస్ట్ సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రమే “మ్యాడ్ స్క్వేర్”. పార్ట్ 1 భారీ హిట్ అయ్యింది. ఇక దీనికి కొనసాగింపుగా పార్ట్ 2 ని మేకర్స్ ఈ ఉగాది కానుకగా రిలీజ్ కి తీసుకురాగా ఇపుడు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సహా వరల్డ్ వైడ్ గా గట్టి వసూళ్లు రాబడుతుంది. మరి ఇలా 4 రోజుల రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వసూళ్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా పి ఆర్ లెక్కల ప్రకారం ఇలా ఉన్నాయి.
నైజాం – 1.55 కోట్లు
సీడెడ్ – 0.60 కోట్లు
ఉత్తరాంధ్ర – 0.46 కోట్లు
తూర్పు గోదావరి – 0.28 కోట్లు
పశ్చిమ గోదావరి – 0.13 కోట్లు
కృష్ణ – 0.21 కోట్లు
గుంటూరు – 0.21 కోట్లు
నెల్లూరు – 0.11 కోట్లు
మొత్తం 3.53 కోట్ల షేర్ ని నాలుగో రోజు మ్యాడ్ స్క్వేర్ తెలుగు రాష్ట్రాల్లో అందుకుంది. ఇక మొత్తం నాలుగు రోజుల వసూళ్ల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
నైజాం – 8.22 కోట్లు
సీడెడ్ – 2.77 కోట్లు
ఉత్తరాంధ్ర – 2.41 కోట్లు
తూర్పు గోదావరి – 1.44 కోట్లు
పశ్చిమ గోదావరి – 0.68 కోట్లు
కృష్ణ – 1.04 కోట్లు
గుంటూరు – 1.30 కోట్లు
నెల్లూరు – 0.58 కోట్లు
మొత్తం 18.44 కోట్ల షేర్ ని కేవలం ఈ నాలుగు రోజుల్లోనే అందుకొని చిత్రం అదరగొట్టింది. మరి ఫుల్ రన్ లో సినిమా ఎక్కడ ఆగుతుందో కూడా చూడాలి మరి. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.