నైజాంలో ‘మ్యాడ్ స్క్వేర్’ డే-2 ర్యాంపేజ్

టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘మ్యాడ్’ చిత్రానికి సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్క్వేర్’ నిన్న(మార్చి 28) బాక్సాఫీస్ దగ్గర గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు కళ్యాణ్ శంకర్ పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించగా ఇందులో రామ్ నితిన్, నార్నె నితిన్, సంగీత్ శోభన్ లీడ్ రోల్స్‌లో నటించారు. ఇక ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌తో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.

ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటుందని.. ఈ సినిమా వసూళ్లు కూడా సాలిడ్‌గా ఉంటాయని నిర్మాత నాగవంశీ ధీమాగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ‘మ్యాడ్ స్క్వేర్’కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఇది నిజం అని తేలింది. తొలిరోజు ఈ సినిమా రూ.20.8 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే, ఈ సినిమాకు నైజాం ఏరియాలో సాలిడ్ రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఈ చిత్రానికి రెండో రోజు కలెక్షన్స్ మొదటి రోజు కంటే ఎక్కువ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ సినిమాలో ప్రియాంక జవాల్కర్, విష్ణు ఓఐ, మురళీధర్ గౌడ్, సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై హారికా సూర్యదేవర, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version