టాలీవుడ్‌లో కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ‘మ్యాడ్’ చిత్రానికి సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్క్వేర్’ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. మంచి బజ్‌తో రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతుండటంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా స్ట్రాంగ్‌గా వెళ్తోంది.
ఈ సినిమాకు ఓవర్సీస్‌లోనూ మంచి రెస్పా్న్స్ దక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు అక్కడ ప్రీమియర్లు, ఫస్ట్ డే కలెక్షన్స్ కలుపుకుని 700K డాలర్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఇది ‘మ్యాడ్’ చిత్ర టోటల్ కలెక్షన్స్ కంటే ఎక్కువని మేకర్స్ వెల్లడించారు. ఇక వీకెండ్ ఉండటంతో ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమాలో నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ హీరోలుగా నటించగా విష్ణు ఓఐ, ప్రియాంక జావల్కర్, సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించారు. మరి ఈ సినిమా ఓవర్సీస్‌లో ఇంకా ఎలాంటి వసూళ్లు రాబడుతుందో చూడాలి.