యూఎస్ లో సాలిడ్ వసూళ్లతో “మ్యాడ్ స్క్వేర్”

యూఎస్ లో సాలిడ్ వసూళ్లతో “మ్యాడ్ స్క్వేర్”

Published on Mar 28, 2025 8:02 AM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలు నార్నె నితిన్ సంగీత్ శోభన్ అలాగే రామ్ నితిన్ ల కలయికలో ఆల్రెడీ వచ్చిన మ్యాడ్ కోసం అందరికీ తెలిసిందే. ఇక సూపర్ హిట్ అయ్యిన ఈ చిత్రానికి సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ ని మేకర్స్ నేడు విడుదలకి తీసుకొచ్చారు. అయితే ఈ చిత్రంపై మంచి హైప్ నే నెలకొనగా యూఎస్ మార్కెట్ లో కూడా ఈ సినిమా సాలిడ్ బుకింగ్స్ ని చూపిస్తుంది.

ఇలా కేవలం ప్రీమియర్స్ తోనే గట్టి వసూళ్లు రాబట్టినట్టుగా డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారు. ఇలా మ్యాడ్ స్క్వేర్ ప్రీమియర్స్ వసూళ్లతోనే 3 లక్షలకి పైగా డాలర్స్ ని అందుకున్నట్టుగా ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది. ఇలా మొత్తానికి మాత్రం ఈ చిత్రం రిలీజ్ కి ముందే మంచి వసూళ్లు అందుకుంటుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు