ప్రస్తుతం మన టాలీవుడ్ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో మ్యాడ్ స్క్వేర్ కూడా ఒకటి. యంగ్ హీరోలు నార్నె నితిన్, సంగీత్ శోభన్ అలాగే రామ్ నితిన్ లు హీరోలుగా కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన సాలిడ్ హిట్ చిత్రం మ్యాడ్ కి సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రం నుంచి ఇపుడు అవైటెడ్ ట్రైలర్ ని అయితే మేకర్స్ రిలీజ్ చేసేసారు.
అయితే ఈ ట్రైలర్ మాత్రం మ్యాడ్ సినిమాకి మించి ఎన్నో రెట్లు బెటర్ గా ఫన్ ట్రీట్ ని అందించేలా ఉందని చెప్పాలి. అసలు ట్రైలర్ స్టార్ట్ అయ్యిన సెకన్ నుంచి లాస్ట్ వరకు సూపర్ ఫన్ తో నాన్ స్టాప్ ఎంటర్టైనింగ్ గా ఈ ట్రైలర్ కొనసాగింది. మెయిన్ గా ముగ్గురు లీడ్ హీరోస్ ఇంకా వీరితో పాటుగా మరో యువ నటుడు విష్ణు పై కామెడీ సీన్స్ అయితే అదిరిపోయాయి అని చెప్పాలి.
తన పెళ్లి అక్కడ నుంచి గోవా ఆ తర్వాత ఈ గ్యాంగ్ పై నడిచే పోలీస్ కామెడీ అంతా వేరే లెవెల్లో ఎంటర్టైన్మెంట్ ని పంచేలా కనిపిస్తుంది. ఇక వీరితో పాటుగా జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్ కేవీ రోల్ కూడా మంచి ఫన్ గా ఉండేలా కనిపిస్తుంది. వీటితో పాటుగా ట్రైలర్ లో స్కోర్ కూడా బాగుంది. మొత్తానికి మాత్రం ఈ మార్చ్ 28న సితార వాళ్ళు డబుల్ బ్లాక్ బస్టర్ మ్యాడ్ ని మించిన భారీ వసూళ్లు అందుకోవడం గ్యారెంటీ అనిపిస్తుంది.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి