మన టాలీవుడ్ లో సాలిడ్ కంటెంట్ తో అదిరే ఎంటర్టైన్మెంట్ ని అందిస్తూ వస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఎప్పుడు ముందుంటారు. మరి ఎప్పటికప్పుడు కొత్త టాలెంట్ ని కూడా ఎంకరేజ్ చేస్తూ వస్తున్నా వీరి నుంచి మరో సాలిడ్ ప్రాజెక్ట్ అయితే ఇపుడు అనౌన్స్ అయ్యింది. మరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది అయినటువంటి నర్నె నితిన్ హీరోగా పరిచయం అవుతూ యంగ్ దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన చిత్రమే “మ్యాడ్”.
మరి ఈ సినిమా నుంచి ఇపుడు విడుదల కూడా ఆ టైటిల్ కి తగ్గట్టే ఉంది అని చెప్పాలి. రెండు స్టూడెంట్ గ్రూప్స్ మధ్య ఉన్న గ్యాంగ్ వార్ ఆ ఫన్ రైడ్ అవన్నీ కూడా యూత్ ని ఆకట్టుకునేలా ఉన్నాయి. హీరో నితిన్ కూడా మంచి గ్రేస్ అండ్ కూల్ లుక్స్ లో కనిపిస్తున్నాడు. అలాగే భీమ్స్ సంగీతం కూడా అదిరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. మొత్తానికి అయితే సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ 4 సినిమాస్ వారు మరో యూత్ ఫుల్ డ్రామాతో వస్తున్నారు అని చెప్పాలి.
టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి


