ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : మార్చి 31, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.75/5
నటీనటులు : వరలక్ష్మీ శరత్ కుమార్, మనోజ్ నందం, ఆన్నీ, రవి వర్మ, ఇనాయ సుల్తాన, తనికెళ్ల భరణి, రఘుబాబు, గెటప్ శ్రీను, రాకెట్ రాఘవ తదితరులు
దర్శకుడు : జి.సుధాకర్
నిర్మాత: పొట్లూరి సత్యనారాయణ
సంగీతం :సెబాస్టియన్ వర్గీస్
ఈటీవీ విన్ ఓటీటీలో నేరుగా రిలీజ్ అయిన చిత్రం ‘మధుశాల’. వరలక్ష్మీ శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
1991 నేపథ్యంలో సాగే ఈ మూవీ కథలో ఎమ్మెల్యే సత్యం(గోపరాజు రమణ) మేనకోడలు పల్లవి(ఆన్నీ) కనిపించకుండా పోతుంది. దీంతో తన ప్రత్యర్థి వెంకట్ రావు(బెనర్జీ) దీనికి కారణమని ఎమ్మెల్యే ఆరోపిస్తాడు. అయితే, దీని వెనకాల మధురవాణి(వరలక్ష్మీ శరత్ కుమార్), దుర్గ(మనోజ్ నందమ్)తో సహా పలువురు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే, వీరంతా ఎవరు..? ఎమ్మెల్యే, పల్లవితో వారికి ఎలాంటి విరోధం ఉంది? అసలు పల్లవి ఏమైంది..? ఆమె అదృశ్యం వెనకాల ఎవరు ఉన్నారు..? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
వరలక్ష్మీ శరత్ కుమార్ తక్కువ స్క్రీన్ టైమ్ ఉన్నప్పటికీ డీసెంట్ వర్క్‌తో ఆకట్టుకుంది. నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో ఆమె ఆకట్టుకుంది. అయితే, ఆమె పాత్రలో కావాల్సిన డెప్త్ మిస్ అయ్యింది. మనోజ్ నందమ్ కూడా తన పర్ఫార్మెన్స్‌తో మెప్పించాడు. రఘు బాబు, గెటప్ శ్రీను, గోపరాజు రమణ, రవి వర్మ వంటి యాకర్స్ కూడా తమ పాత్రలో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు.
మైనస్ పాయింట్స్ :
1990ల జరిగే కథ అయినప్పటికీ, ఇది ఔట్‌డేటెడ్‌గా అనిపిస్తుంది. ఈ సినిమా నెరేషన్ చాలా వీక్‌గా ఉంది. సినిమా ఎగ్జిక్యూషన్ చాలా నీరసంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాతో ఎంగేజింగ్ కాలేరు.
సింపుల్ కథ అయినప్పటికీ బలమైన పాత్రలు ఈ సినిమాలో ఉండే అవకాశం ఉంది. కానీ, అవి మనకు కనిపించవు. చాలా పాత్రలు ఇందులో ఎందుకు ఉన్నాయో కూడా అర్థం కాదు. తనికెళ్ల భరణి లాంటి యాక్టర్‌ను వేస్ట్ చేసినట్లుగా అనిపిస్తుంది.
చాలా సీన్స్ ఎందుకు వస్తున్నాయో.. ఎందుకు వెళ్తున్నాయో కూడా అర్థం కాదు. ఒక క్రైమ్ థ్రిల్లర్ కథకు కావాల్సిన టెన్షన్ ఈ సినిమాలో ఎక్కడా కనిపించదు. సీరియస్ ఇన్సిడెంట్స్ కూడా చాలా తేలికగా సాగిపోతాయి.
వరలక్ష్మీ శరత్ కుమార్ పర్ఫార్మెన్స్ బాగున్నా, ఆమె పాత్ర ఎలాంటి ఇంపాక్ట్ చూపించలేదు. ఆమె పాత్రకు సంబంధించిన సీన్స్ ఏమాత్రం ఆకట్టుకోని విధంగా సాగుతాయి.
సాంకేతిక వర్గం :
దర్శకుడు జి.సుధాకర్ ‘మధుశాల’ చిత్రాన్ని ఓ యావరేజ్ చిత్రంగా మలచడంలోనూ ఫెయిల్ అయ్యారు. వీక్ రైటింగ్‌తో పాటు ఏమాత్రం ఆకట్టుకోని స్క్రీన్ ప్లే ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్. సినిమాటోగ్రఫీ వర్క్ కొంతమేర డీసెంట్‌గా అనిపిస్తుంది. రీ-రికార్డింగ్ పనులు మాత్రం చాలా టెర్రిబుల్. సౌండ్ డిజైన్‌లో చిత్ర యూనిట్ చాలా జాగ్రత్త తీసుకోవాల్సింది. ఎడిటింగ్ వర్క్ కూడా చాలా దారుణంగా ఉన్నట్లు అనిపిస్తుంది. చాలా సీన్స్ ట్రిమ్ చేయాల్సిన అవసరం ఉన్నట్లు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు పెద్దగా ప్రత్యేకంగా కనిపించవు.
తీర్పు :
ఓవరాల్‌గా ‘మధుశాల’ ఎలాంటి ఆసక్తికర అంశాలు లేని ఓ డల్ చిత్రంగా నిలిచింది. వరలక్ష్మీ శరత్‌కుమార్, మనోజ్ నందం పాత్రలు కొంతమేర ఆకట్టుకునే ప్రయత్నం చేసినా, మిగతా నటీనటులు ఏమాత్రం ఆకట్టుకోరు. ఇక ఈ చిత్ర స్క్రీన్ ప్లే చాలా వీక్‌గా ఉండటం ప్రేక్షకులను ఆకట్టుకోదు. ఈ సినిమాను స్కిప్ చేసి వేరొక ఎంటర్‌టైనింగ్ సినిమాను చూడటం బెటర్.
123telugu.com Rating: 1.75/5
Reviewed by 123telugu Team