50 కోట్ల క్లబ్ లోకి “మహారాజ”

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ మహారాజ జూన్ 14, 2024న థియేటర్ల లో రిలీజ్ అయ్యింది. రిలీజైన తొలిరోజు నుండే సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. తాజాగా ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 50 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టడం జరిగింది. ఇది సెన్సేషన్ రెస్పాన్స్ అని చెప్పాలి. లాంగ్ రన్ లో ఈ చిత్రం మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

విజయ్ సేతుపతి నుండి సాలిడ్ కమ్ బ్యాక్ కోసం ఎదురు చూసిన అభిమానులకు మంచి ట్రీట్ ఇది. విజయ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. కురంగు బొమ్మై చిత్రానికి ప్రసిద్ధి చెందిన నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.

Exit mobile version