డిజిటల్ ప్రీమియర్ కి “మహారాజ” రెడీ?

డిజిటల్ ప్రీమియర్ కి “మహారాజ” రెడీ?

Published on Jul 7, 2024 8:01 PM IST

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి 50వ చిత్రంగా తెరకెక్కిన కోలీవుడ్ చిత్రం మహారాజ భారీ విజయాన్ని అందుకుంది. నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 100 కోట్ల రూపాయల క్లబ్ లో చేరింది. దాని తెలుగు వెర్షన్‌కి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. మహారాజ చిత్రం జూలై 12, 2024న నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్, నట్టి (నటరాజ్), భారతీరాజా, అభిరామ్, సింగంపులి, అరుల్‌దాస్, మునిష్కాంత్, వినోద్ సాగర్, బాయ్స్ మణికందన్, కల్కి మరియు సచన నిమిదాస్ కీలక పాత్రల్లో నటించారు. సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి నిర్మించిన ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు