అన్ని చోట్ల సాలిడ్ రెస్పాన్స్ తో దూసుకు పోతున్న “మహారాజ”

అన్ని చోట్ల సాలిడ్ రెస్పాన్స్ తో దూసుకు పోతున్న “మహారాజ”

Published on Jun 18, 2024 10:30 PM IST

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ మహారాజ జూన్ 14, 2024న థియేటర్ల లో రిలీజ్ అయ్యింది. రిలీజైన తొలిరోజు నుండే సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ చిత్రం రిలీజైన తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్ తో దూసుకు పోతుంది.

తమిళం లో ఈ ఏడాది ఫస్ట్ వీకెండ్ కే హయ్యెస్ట్ వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఏడాది డబ్బింగ్ చిత్రాల్లో ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. మరొక పక్క కర్ణాటక లో 4 రోజుల్లోనే 2.65 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. కేరళ ప్రాంతం లో 5 కోట్ల రూపాయల దిశగా అడుగులు వేస్తోంది. ఈ చిత్రం ఈ ప్రాంతాల్లో లాంగ్ రన్ లో సాలిడ్ వసూళ్లు రాబట్టడం ఖాయం.

విజయ్ సేతుపతి నుండి సాలిడ్ కమ్ బ్యాక్ కోసం ఎదురు చూసిన అభిమానులకు మంచి ట్రీట్ ఇది. కురంగు బొమ్మై చిత్రానికి ప్రసిద్ధి చెందిన నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు