‘మ‌హారాజ’ దూకుడు.. వ‌సూళ్ల‌తో దుమ్ములేపుతున్నాడు!

‘మ‌హారాజ’ దూకుడు.. వ‌సూళ్ల‌తో దుమ్ములేపుతున్నాడు!

Published on Jun 18, 2024 4:03 PM IST

త‌మిళ విల‌క్ష‌ణ న‌టుడు విజయ్ సేతుప‌తి న‌టించిన తాజా చిత్రం ‘మ‌హారాజ’ జూన్ 14న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వ‌ద్ద మంచి రెస్పాన్స్ తో దూసుకెళ్తోంది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు నిధిల‌న్ సామినాథ‌న్ పూర్తి స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీగా తెర‌కెక్కించారు. కాగా, ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో స‌క్సెస్ అయ్యింది.

ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి నాలుగు రోజులైనా, అద్భుత‌మైన రెస్పాన్స్ తో సాలిడ్ వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. ఈ సినిమా నాలుగు రోజుల్లో రూ.40 కోట్ల మేర గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన‌ట్లుగా చిత్ర వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇక తెలుగులో ఈ సినిమా రూ.10 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టిన‌ట్లుగా తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ వ‌సూళ్లు ఇంకా పెరిగే అవ‌కాశం ఉంద‌ని చిత్ర వ‌ర్గాలు చెబుతున్నాయి.

కాగా, విజయ్ సేతుప‌తి ముఖ్య పాత్ర‌లో న‌టించిన ఈ సినిమాలో అనురాగ్ క‌శ్య‌ప్, మ‌మ‌తా మోహ‌న్ దాస్, అభిరామి త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమా విజ‌య్ సేతుప‌తి కెరీర్ లో 50వ చిత్రంగా తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు