నిర్మాత‌కు లాభాలు తీసుకొస్తున్న మ‌హారాజ‌

నిర్మాత‌కు లాభాలు తీసుకొస్తున్న మ‌హారాజ‌

Published on Jun 17, 2024 12:56 PM IST


త‌మిళ వ‌ర్స‌టైల్ యాక్ట‌ర్ విజ‌య్ సేతుపతి న‌టించిన లేటెస్ట్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ ‘మ‌హారాజ’ ఇటీవ‌ల రిలీజ్ అయ్యింది. ఈ సినిమా టీజ‌ర్, ట్రైల‌ర్లు ప్రేక్ష‌కుల్లో సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేశాయి. ఇక ఆ అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో ‘మ‌హారాజ’ మూవీ విజ‌యం సాధించింది. తొలిరోజే ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావ‌డంతో ప్రేక్ష‌కులు ఈ సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

అయితే, ‘మ‌హారాజ’ సినిమాను తెలుగులో రిలీజ్ చేశారు ప్ర‌ముఖ నిర్మాత ఎన్వీ ప్ర‌సాద్.ఈ చిత్ర థియేట్రిక‌ల్, శాటిలైట్ రైట్స్ ను ఆయ‌న రూ.2 కోట్ల‌కు సొంతం చేసుకున్నారు. కాగా, ఈ సినిమా ఇప్పుడు నిర్మాత‌కు లాభాలను తెచ్చిపెట్ట‌నుంది. ఈ సినిమా నైజం ఏరియాలోనే రూ.2 కోట్ల వ‌సూళ్లను రాబ‌డుతుంద‌ని సినీ ఎక్స్ ప‌ర్ట్స్ అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొత్తంగా రూ. 5 కోట్ల వ‌ర‌కు క‌లెక్ట్ చేసే అవ‌కాశం ఉంది.

ఇక శాటిలైట్ రైట్స్ రూపంలో మరో రూ.3 కోట్ల వ‌ర‌కు నిర్మాత‌కు ద‌క్క‌నుంద‌ట‌. దీంతో ‘మ‌హారాజ’ తెలుగు రిలీజ్ తో నిర్మాత ఏకంగా రూ.6 కోట్ల లాభాన్ని ద‌క్కించుకోనున్నార‌ని టాక్ వినిపిస్తోంది. ఓ త‌మిళ డ‌బ్బింగ్ సినిమాతో ఈమ‌ధ్య కాలంలో ఇంత‌గా లాభం ఎవ‌రూ ద‌క్కించుకోలేద‌నే చెప్పాలి. ఇక ‘మ‌హారాజ’ సినిమాలో విజ‌య్ సేతుప‌తి ప‌ర్ఫార్మెన్స్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు