మహేష్ 28 నెక్స్ట్ అప్ డేట్ ఆరోజునే : నిర్మాత అఫీషియల్ ప్రకటన

సూపర్ స్టార్ మహేష్ బాబుతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ SSMB 28 ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మహేష్ బాబు ఊర మాస్ పాత్ర లో కనిపించనున్న ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ గ్రాండ్ గా నిర్మిస్తుండగా పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక మొదటి నుండి అందరిలో ఎన్నో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నుండి నిన్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఫస్ట్ లుక్ రిలీజ్ అయి సోషల్ మీడియాని షేక్ చేసింది.

అలానే ఈ మూవీని సంక్రాంతి కానుకగా 2024 జనవరి 13న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు. అయితే తాజగా SSMB 28 నుండి నెక్స్ట్ అప్ డేట్ ని సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి రోజున రిలీజ్ చేస్తాం అని నేడు నిర్మాత నాగ వంశీ కొద్దిసేపటి క్రితం తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలిపారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ తో సూపర్ ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారని భావిస్తున్నాం అని అలానే రానున్న నెక్స్ట్ అప్ డేట్ అందరినీ మరింతగా అలరిస్తుందని వంశీ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

Exit mobile version