మహేష్ మరో మోస్ట్ అవైటెడ్ కాంబో అప్డేట్ ఆరోజునే.?

Published on Aug 6, 2020 9:14 pm IST


ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వరుస విజయ చిత్రాల దర్శకుడు పరశురాంతో “సర్కారు వారి పాట” అనే మాస్ ఫ్లిక్ లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే దీని తర్వాత మహేష్ లైన్ లో ఉన్న సినిమాలు కూడా మామూలు రేంజ్ వి కాదు.

దర్శక ధీరుడు రాజమౌళి తో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ఒకటి అయితే దాని తర్వాతో అంత కన్నా ముందే వచ్చే సినిమాయో కానీ తమిళ్ దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ తో ఒక సినిమా ఫిక్స్ అయ్యిందని టాక్ వినిపించింది. దీనితో ఈ ప్రాజెక్ట్ కూడా కన్ఫర్మ్ అయితే చూడాలని ఎదురు చూస్తున్నారు.

అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో బజ్ ఇప్పుడు వినిపిస్తోంది. ఈ సినిమా అధికారిక అనౌన్స్మెంట్ ఈ ఆగస్ట్ 9 న మహేష్ పుట్టినరోజు కావడంతో ఆరోజునే ఉండనుంది అని వినిపిస్తుంది. ఇప్పటికే కోలీవుడ్ లో ఒక ఊపు ఊపుతున్న లోకేష్ మహేష్ తో సినిమా చేస్తున్నారో లేదో తెలియాలి అంటే అప్పటి వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :

More