మహేష్ తో రాజమౌళి సినిమా అప్పుడే ?

మహేష్ తో రాజమౌళి సినిమా అప్పుడే ?

Published on Apr 11, 2021 3:30 PM IST

రాజమౌళి త‌న నెక్ట్స్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్నాడని, ఆ మధ్యే జక్కన్న క్లారిటీ ఇచ్చాడు. ఇక అప్పటి నుండి ఈ సినిమా పై అనేక రూమర్స్ బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరో రూమర్ ఒకటి ఈ సినిమా గురించి బాగా వినిపిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాదికి గాని మొదలు కాదని తెలుస్తోంది. ఈ గ్యాప్ లో మహేష్ త్రివిక్రమ్ తో ఒక సినిమా చేస్తాడట. ఆ సినిమా తరువాత రాజమౌళి సినిమా మీదకు వెళ్తాడట.

ఇక రాజమౌళి – మహేష్ సినిమా పై కూడా అప్పుడే అనేక ఊహాగానాలు మొదలైపోయాయి. ఛత్రపతి శివాజీ చరిత్ర ఆధారంగా రాబోతోందట ఈ సినిమా. మహేష్ బాబు ఈ సినిమాలో ఛత్రపతి శివాజీగా నటిస్తున్నాడట. మరి ఈ రూమర్ లో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. ఏది ఏమైనా ఈ సినిమా పై రూమర్స్ మాత్రం ఆగడం లేదు. ఇక ప్రసుతం మహేష్ పరుశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న అత్యున్నత భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా పై పాన్ ఇండియా లెవల్లో ఫుల్ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు