కృష్ణుడిగా మహేష్.. ఇదే నిజం !

దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? అంటూ మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ పై చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఐతే, తాజాగా మరో కొత్త సినిమాకి సంబంధించి మహేష్ పాత్ర పై ఓ క్రేజీ గాసిప్ బాగా వైరల్ అయింది. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా ‘దేవకి నందన వాసుదేవ’ అనే సినిమా చేస్తున్నాడు. ఐతే, ఈ సినిమాలో మహేష్, శ్రీకృష్ణుడి పాత్రలో కొన్ని క్షణాల పాటు కనిపిస్తాడని పుకార్లు షికార్లు చేశాయి.

కానీ, ఈ వార్తకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. మహేష్ ‘దేవకి నందన వాసుదేవ’ సినిమాలో ఎలాంటి పాత్రలో నటించడం లేదు. శ్రీకృష్ణుడి పాత్రలో కొన్ని క్షణాల పాటు కనిపిస్తాడని వచ్చిన పుకార్లు పూర్తిగా అవాస్తవం. అలాంటి ప్లానింగ్ ఏమి లేదు. ఇక మహేష్ – రాజమౌళి సినిమా విషయానికి వస్తే.. భారీ అంచనాలున్న ఈ ప్రాజెక్టు 2025 లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పై రాజమౌళి టీమ్ వర్క్ చేస్తోంది.

Exit mobile version