బాధగా ఉంది.. సిరివెన్నెల మృతిపై మహేశ్‌బాబు ట్వీట్..!

Published on Dec 1, 2021 1:01 am IST


సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి తెలుగు చిత్ర పరిశ్రమలో తీరని విషాదాన్ని నింపింది. న్యూమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల ఈ నెల 24న కిమ్స్‌ ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ రోజు సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు. అయితే సిరివెన్నెల మృతికి నియాతో బాధపడుతున్న సిరివెన్నెల ఈ నెల 24న కిమ్స్‌ ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ రోజు సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు. అయితే సిరివెన్నెల మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా స్పందించారు. సాహిత్య మేధావి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. ఈ కష్ట సమయంలో నా ఆలోచనలు, ప్రార్థనలు ఆయన కుటుంబంతో ఉన్నాయి. రెస్ట్ ఇన్ పీస్ సార్ అంటూ ట్విట్టర్‌ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.

సంబంధిత సమాచారం :