న్యూయార్క్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న మహేశ్ అండ్ ఫ్యామిలీ

న్యూయార్క్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న మహేశ్ అండ్ ఫ్యామిలీ

Published on Sep 4, 2024 8:00 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాను దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో అంచనాలు పీక్స్‌లో నెలకొన్నాయి. ఇక ఈ సినిమాను గ్లోబల్ సబ్జెక్ట్‌గా తెరకెక్కించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

అయితే, ఈ సినిమా కోసం మహేశ్ బాబు తన లుక్స్‌ని పూర్తిగా మార్చేస్తున్నాడు. ఇప్పటికే జుట్టుతో పాటు గడ్బం కూడా పెంచేస్తూ కనిపిస్తున్నాడు. కాగా, ప్రస్తుతం ఆయన తన ఫ్యామిలీతో కలిసి యూఎస్‌లో వెకేషన్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా న్యూయార్క్ వీధులను ఎక్స్‌ప్లోర్ చేస్తూ తన భార్య నమ్రతాతో మహేశ్ ఓ ఫోటో దిగాడు.

దీన్ని నమ్రతా తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోను మహేశ్ అభిమానులు నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు. బెస్ట్ లుక్‌లో మహేశ్ అంటూ వారు కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు