మురుగదాస్ మహేష్‌తో సినిమా చేయాలి.. ఇది వాళ్ళు చెబుతున్న మాట

మురుగదాస్ మహేష్‌తో సినిమా చేయాలి.. ఇది వాళ్ళు చెబుతున్న మాట

Published on Sep 26, 2020 4:50 PM IST

సౌత్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన ఏ.ఆర్. మురుగదాస్ నిన్న సెప్టెంబర్ 25న పుట్టినరోజు జరుపుకుటున్నారు. యాక్షన్ సినిమాలకు మురుగదాస్ పెట్టింది పేరు. ఈయన ‘దీన, రమణ, గజినీ, స్టాలిన్, తుపాకి, కత్తి, సర్కార్’ లాంటి హెవీ యాక్షన్ ఎంటెర్టైనర్లు రూపొందించారు. విజయ్ కాంత్, రజనీకాంత్, విజయ్, మెగాస్టార్ చిరంజీవి, అమీర్ ఖాన్, అక్షయ కుమార్, మహేష్ బాబు, సూర్య లాంటి స్టార్ హీరోలతో వర్క్ చేసిన అనుభవం ఉంది మురుగదాస్ కు.

నిన్న ఆయన పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విషెస్ చెప్పిన ఆయన అభిమానులు ఆసక్తికరమైన ఒక విషయాన్ని చర్చకు తెచ్చారు. మురుగదాస్ మళ్ళీ ఏ స్టార్ హీరోతో వర్క్ చేస్తే బాగుంటుందనేదే ఆ చర్చ. ఈ చర్చలో భాగంగా అనేక మంది ఆన్ లైన్ పోల్స్ నిర్వహించి అందులో చిరంజీవి, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, మహేష్ బాబుల పేర్లు ఉంచగా ఎక్కువమంది మహేష్ బాబుతోనే మురుగదాస్ మరోసారి వర్క్ చేస్తే బాగుంటుందని ఓట్లు వేశారు.

2017లో మహేష్ బాబు, మురుగదాస్ కలిసి ‘స్పైడర్’ సినిమా చేశారు. భారీ హైప్ నడుమ తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమా ఫలితంతో మహేష్ మాత్రమే కాదు ఆయన అభిమానులంతా తీవ్రంగా డిసప్పాయింట్ అయ్యారు. అయినా వారు మళ్ళీ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు మరో సినిమా చేయాలని, చేస్తే బాగుంటుందని కోరుకోవడం విశేషం. మురుగదాస్ కు సైతం మహేష్ అంటే చాలా అభిమానం. ‘స్పైడర్’ సినిమా పరాజయం పొందినా కూడ మురుగదాస్ ఇప్పటికీ తన ట్విట్టర్ ఆకౌంట్ కవర్ పిక్ గా ‘స్పైడర్’లోని మహేష్ స్టిల్ ను పెట్టుకుని ఉంటారు. అంత అభిమానం ఉన్న మురుగదాస్ మహేష్ మళ్లీ ఛాన్స్ ఇస్తే సినిమా చేయకుండా ఉంటారా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు