‘ముఫాసా’ కోసం మహేష్ ఫ్యాన్స్ వెయిటింగ్!

‘ముఫాసా’ కోసం మహేష్ ఫ్యాన్స్ వెయిటింగ్!

Published on Dec 14, 2024 10:00 PM IST

హాలీవుడ్ మూవీ ‘ది లయన్ కింగ్’కి వరల్డ్‌వైడ్‌గా ఎలాంటి పాపులారిటీ సంపాధించుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా ఫ్రాంచైజీ నుండి ‘ముఫాసా’ చిత్రం అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యింది. వాల్ట్ డిస్నీ నుండి వస్తున్న ఈ సినిమాకు ఇండియాలోనూ మంచి క్రేజ్ నెలకొంది. అయితే, ఈ సినిమాను ఇంగ్లీష్‌తో పాటు పలు ఇండియన్ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. తెలుగులోనూ ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.

అయితే, ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్‌కి స్టార్ హీరో మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ‘ముఫాసా’పై అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్, ట్రైలర్స్‌తో పాటు ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. అయితే, ఇప్పుడు ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

‘గుంటూరు కారం’ తరువాత మహేష్ చేయబోయే సినిమా రాజమౌళి డైరెక్షన్‌లో రానుంది. ఈ సినిమాకు మినిమం రెండేళ్ల సమయం పట్టడం ఖాయమని.. అందుకే ‘ముఫాసా’ చిత్రంలో తమ హీరో వాయిస్‌ను వినేందుకు అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. తమ అభిమాన హీరోను రెండేళ్ల వరకు బిగ్ స్క్రీన్‌పై చూడలేమని.. అందుకే ఆయన వాయిస్‌ను వినడానికైనా ‘ముఫాసా’ చిత్రాన్ని చూడాలని వారు భావిస్తున్నారు. ఇక ‘ముఫాసా’ చిత్రం డిసెంబర్ 20న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు