కీర్తి వెల్కమ్ తో సాలిడ్ అప్డేట్ ఇచ్చిన మహేష్.!

Published on Oct 17, 2020 10:37 am IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “సర్కారు వారి పాట”. వరుస విజయ చిత్రాల దర్శకుడు పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా మహేష్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అన్నది ఇన్ని రోజుల ఆ సస్పెన్స్ గా నడుస్తూ వస్తుంది. కానీ లేటెస్ట్ గా ఆ సస్పెన్స్ కు తెర దించేసి సూపర్ స్టార్ మహేష్ తన ఫ్యాన్స్ కు ఊహించని అప్డేట్ ఇచ్చారు.

ఈరోజు అభినయ నటి కీర్తి సురేష్ పుట్టినరోజు కావడంతో ఎంతో మంది తారలు విషెష్ తెలిపారు. అలా మహేష్ కూడా తెలుపుతూ తమ “సర్కారు వారి పాట” లోకి వెల్కమ్ అంటూ ఈ సినిమా కూడా ఆమె కెరీర్ లో మరపురాని చిత్రంగా నిలుస్తుంది అని తెలిపారు. సో మొత్తానికి మహేష్ ఫ్యాన్స్ కు కావాల్సిన సాలిడ్ అప్డేట్ ను స్వయంగా మహేషే ఇచ్చేసారు.

దీనితో మహేష్ ఫాన్స్ లో మరోసారి మంచి ఉత్సాహం నెలకొంది. ఈ చిత్రం షూట్ వచ్చే నవంబర్ లో మొదలు కానుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సహా మహేష్ లు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More