ట్రిప్ ముగించుకుని హైదరాబాద్ కి వచ్చిన సూపర్ స్టార్ అండ్ ఫ్యామిలీ!

ట్రిప్ ముగించుకుని హైదరాబాద్ కి వచ్చిన సూపర్ స్టార్ అండ్ ఫ్యామిలీ!

Published on Sep 13, 2024 2:10 AM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ లో వరుస సక్సెస్ ఫుల్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ హీరో తదుపరి పాన్ ఇండియా డైరెక్టర్, దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రకటించిన్పటి నుండి సూపర్ స్టార్ మహేష్ మరింత హాట్ టాపిక్ గా మారిపోయారు. సినిమా అప్డేట్ కోసం ఆడియెన్స్, ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ చిత్రం కోసం మునుపెన్నడూ లేని విధంగా మేకోవర్ అవుతున్నాడు మహేష్ బాబు. పొడవాటి జుట్టు, గుబురు గడ్డం తో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. సినిమా కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతున్నాడు. అయితే ఇటీవల న్యూయార్క్ నగరానికి ఫ్యామిలీతో ట్రిప్ కి వెళ్ళిన మహేష్, తాజాగా హైదరాబాద్ లో అడుగు పెట్టాడు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు