సూపర్ : మహేష్ లేటెస్ట్ లుక్ తో SSMB 28 కి మరింత కిక్

సూపర్ : మహేష్ లేటెస్ట్ లుక్ తో SSMB 28 కి మరింత కిక్

Published on Feb 5, 2023 11:41 PM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు తో త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ SSMB 28 పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీలో పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని ఆగష్టు 11న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఇటీవల నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. ఇక మహేష్ తో దాదాపుగా పన్నెండేళ్ల తరువాత చేస్తున్న మూవీ కావడం అలానే దీనిపై అందరిలో భారీ అంచనాలు ఉండడంతో వాటికి ఏమాత్రం తగ్గకుండా గ్రాండ్ లెవెల్లో త్రివిక్రమ్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు చెప్తోంది యూనిట్.

అయితే విషయం ఏమిటంటే, ప్రస్తుతం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుండి ఇప్పటికే మహేష్ బాబుకి సంబంధించి రిలీజ్ అయిన ఒక లీక్డ్ పిక్ అందరినీ ఆకట్టుకుంది. అయితే భర్త మహేష్ బాబుతో పాటు తమ స్నేహితులతో కలిసి పాల్గొన్న నిన్నటి డిన్నర్ పిక్ ఫోటోలని నిన్న నమ్రత తన ఇన్స్టాగ్రమ్ లో పోస్ట్ చేసారు. అయితే ఆ పిక్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు మాస్ స్టైల్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుండడంతో పాటు ముఖ్యంగా సూపర్ ఫ్యాన్స్ ని మరింతగా ఆకర్షిస్తోంది. నిన్నటి నుండి సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్న ఈ పిక్ లో ఫుల్ గా క్రాఫ్, కొద్దిగా గడ్డంతో సూపర్ స్టార్ అదరగొట్టారు. దీనిని బట్టి సినిమాలో మహేష్ లుక్ అదిరిపోనుందని తెలుస్తోందని, ఈ లుక్ నిజంగా SSMB 28 మూవీకి మరింత కిక్ ఇవ్వడం ఖాయం అంటున్నారు పలువురు సూపర్ స్టార్ అభిమానులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు