‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’కి మహేష్ అభినందనలు

‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’కి మహేష్ అభినందనలు

Published on Sep 1, 2024 12:00 AM IST

టాలీవుడ్‌లో తెరకెక్కిన రీసెంట్ మూవీ ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్‌ను తెచ్చుకుంది. ఈ సినిమాను సుకుమార్ సతీమణి తబిత సుకుమార్ సమర్పించడం.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ ఈ సినిమాను ప్రమోట్ చేయడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక ఈ సినిమా రిలీజ్ తరువాత ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ను తెచ్చుకుంది. కాగా, ఈ సినిమాకు సెలెబ్రిటీలు సైతం అభినందనలు తెలిపారు. తాజాగా ఈ జాబితాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’పై ప్రశంసలు కురిపించారు. రీసెంట్ టైమ్‌లో వచ్చిన హిలేరియస్ చిత్రాల్లో ఈ సినిమా నిలుస్తుందని మహేష్ అన్నారు.

ఇలా మహేష్ బాబు తమ సినిమా గురించి అభినందనలు తెలపడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాలో రావు రమేశ్ మెయిల్ లీడ్‌లో నటించాడు. ఈ సినిమాను లక్ష్మణ్ కార్య డైరెక్ట్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు