ఈ ఓటిటిలోకి వచ్చేసిన మహేష్ “ముఫాసా”

ఈ ఓటిటిలోకి వచ్చేసిన మహేష్ “ముఫాసా”

Published on Mar 26, 2025 3:09 PM IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లాస్ట్ చిత్రం గుంటూరు కారం. మరి ఈ సినిమా తర్వాత కొన్నేళ్లు పాటుగా మహేష్ నుంచి కొత్త సినిమాలు ఏవి లేవని అందరికీ తెలుసు. కానీ మధ్యలో మహేష్ పాత సినిమాలే రీరిలీజ్ కి తెచ్చుకున్నారు అభిమానులు. కానీ ఈ సినిమాలు కాకుండా మహేష్ నుంచి ఓ కంప్లీట్ కొత్త సినిమా ట్రీట్ ఇచ్చింది. ఆ సినిమానే “ముఫాసా – ది లయన్ కింగ్”.

హాలీవుడ్ కి చెందిన చిత్రం డిస్నీ సంస్థ నుంచి వచ్చిన ఈ లైవ్ యానిమేటెడ్ చిత్రం మంచి హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా తెలుగు వెర్షన్ కి మహేష్ బాబు ముఫాసాగా డబ్బింగ్ చెప్పిన ఈ చిత్రం తెలుగులో మంచి మైలేజ్ ఇచ్చింది. ఇలా థియేటర్స్ లో పిల్లలు పెద్దలని అలరించిన ఈ చిత్రం ఇపుడు ఓటిటిలో సందడి చేసేందుకు వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు జియో హాట్ స్టార్ వారు సొంతం చేసుకోగా నేడు మార్చ్ 26 నుంచి ఈ చిత్రం అందుబాటులోకి వచ్చేసింది. ఇంగ్లీష్ సహా మన తెలుగులో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉంది. సో అప్పుడు మిస్ అయ్యినవారు ఇపుడు చూడొచ్చు.

ముఫాసా సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు