వైరల్ పిక్ : రమేష్ బాబు పిల్లతో మహేష్ బాబు

వైరల్ పిక్ : రమేష్ బాబు పిల్లతో మహేష్ బాబు

Published on Nov 18, 2022 3:00 AM IST


టాలీవుడ్ లెజెండరీ సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ మూడు రోజుల క్రితం హార్ట్ అటాక్ తో హఠాన్మరణం పొందిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో ఒక్కసారిగా చిత్ర సీమతో పాటు యావన్మంది సూపర్ స్టార్ ఫ్యాన్స్, ఘట్టమనేని కుటుంబసభ్యులు, ఆడియన్స్ అందరూ కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అనంతరం ఆయన కుమారుడు మహేష్ బాబు తండ్రి కృష్ణ అంత్యక్రియలు నిర్వహించారు.

కాగా కృష్ణ మరణించి మూడు రోజులు కావడంతో మూడవరోజు కార్యక్రమాన్ని నేడు కుటుంబసభ్యులు నిర్వహించారు. పలువురు ఘట్టమనేని ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రముఖులు కూడా తరలివచ్చి తమ ప్రియతమ సూపర్ స్టార్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఇక ఈ కార్యక్రమంలో దివంగత నటుడు రమేష్ బాబు కుమారుడు మరియు కుమార్తెతో మహేష్ బాబు ప్రత్యేకంగా ఫోటోలు దిగారు మహేష్ బాబు. కాగా ప్రస్తుతం వార్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు