సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రం SSMB29 కోసం యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
ఇక ఈ షూటింగ్ ఒడిశాలో జరుగుతుండగా, అక్కడి ప్రభుత్వం తమ రాష్ట్రంలో ఇలాంటి ప్రెస్టీజియస్ చిత్రం షూటింగ్ జరుపుకోవడంపై సంతోషం వ్యక్తం చేస్తుంది. ఈ కారణంతో SSMB29 చిత్ర యూనిట్‌తో అక్కడి ప్రభుత్వ అధికారులు వరుసగా ఫోటోలు దిగుతూ సందడి చేస్తున్నారు. అయితే, తాజాగా ఒడిశాలోని దేవ్ మాలి పర్వతంపై మొక్కలు నాటే కార్యక్రమానికి మహేష్ బాబు, రాజమౌళిని అక్కడి అధికారులు ఆహ్వానించారు.
దీంతో వారిరువురు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.