ప్రజలకు మహేష్ నుండి విజ్ఞప్తి !

Published on Jun 29, 2020 6:12 pm IST


కరోనా మహమ్మారి పై మొదటి రోజు నుండి సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. కరోనా నివారణ పై అవగాహన పెంచడానికి మహేష్ తన వంతు కృషి చేస్తూనే ఉన్నారు. మహేష్ తాజాగా ట్వీట్ చేస్తూ.. “లాక్ డౌన్ సడలించబడిన తరువాత, కేసులు పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. మనం మనల్ని, మన చుట్టుపక్కల ప్రజలను కూడా రక్షించుకునే సమయం ఇది. దయచేసి బయటికి వచ్చేటప్పుడు ఎప్పుడూ ముసుగు ధరించండి. అలాగే మీ పరిసరాల గురించి కూడా తెలుసుకోండి, దయచేసి సామాజిక దూరాన్ని పాటించండి.” అని ఆరోగ్య సేతు యాప్ లింక్ ను కూడా పోస్ట్ చేశారు.

ఈ కష్ట సమయంలో మహేష్ పెద్ద మొత్తంలో విరాళం ఇవ్వడమే కాకుండా, ప్రభుత్వ కార్యక్రమాలన్నిటిలో కూడా ఆయన పరోక్షంగా పాల్గొంటూనే ఉన్నారు. ఇక మహేష్ బాబు లాక్ డౌన్ లో భాగంగా ప్రస్తుతం ఆయన ఇంట్లోనే ఉన్నారు. ఈ ఖాళీ సమయాన్ని మిస్ అయిన సినిమాలను చూస్తూ.. అలాగే సోషల్ మీడియా ద్వారా అభిమానులకు మరింత దగ్గరగా ఉంటూ వారికి కరోనా పై అవగాహన కల్పిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More