ఆ పని చేయొద్దంటూ నిర్మాతలకు మహేశ్ రిక్వెస్ట్..?

ఆ పని చేయొద్దంటూ నిర్మాతలకు మహేశ్ రిక్వెస్ట్..?

Published on Sep 13, 2024 2:37 AM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం పాన్ వరల్డ్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ తన నెక్స్ట్ ప్రాజెక్టును రెడీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇక ఈ సినిమా కోసం మహేశ్ ప్రస్తుతం తన లుక్ కోసం రెడీ అవుతున్నాడు.

అయితే, మహేశ్ ఈ సినిమాతో బాలీవుడ్ ఆడియెన్స్‌కు తొలిసారిగా పరిచయం కాబోతున్నాడు. మహేశ్ చేసిన ఏ సినిమా కూడా నేరుగా హిందీలో రిలీజ్ కాలేదు. రాజమౌళి సినిమాతో ఆయన డైరెక్ట్‌గా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో, ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు తన పాత సినిమాలేవీ కూడా హిందీ డబ్ చేయొద్దని మహేశ్ ఆయా చిత్రాల నిర్మాతలను కోరినట్లుగా తెలుస్తోంది.

ఇక రాజమౌళితో మహేశ్ చేయబోయే సినిమా అడ్వెంచర్ త్రిల్లర్‌గా ఉండబోతుంది. ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉంటుందని.. ప్రస్తుతం క్యాస్ట్ సెలెక్షన్ కోసం కసరత్తులు సాగుతున్నాయని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు