ఫ్యాన్స్ తో ‘మహేష్ బాబు’ ముచ్చట్లు !

Published on May 31, 2020 6:31 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్షణం వచ్చేసింది. ఏకంగా తనతోనే ముచ్చటించే బంపర్ ఆఫర్ ను మహేష్ తన అభిమానులకు ఇవ్వడంతో.. ఫ్యాన్స్, మహేష్ తో ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఛాట్ చేయడానికి రెడీ అయిపోయారు. మరి ఈ ఆసక్తికరమైన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఏమిటో చూద్దాం.

ఓ అభిమాని ‘ మీ ఫేవరేట్ కలర్ అండ్ ఫుడ్ ఏమిటి ?’ అని అడగగా.. ‘నా ఫేవరేట్ కలర్ బ్లూ, నాకు ఇష్టమైన ఫుడ్ మన సంప్రదాయ హైదరాబాద్ బిర్యానీ’ అని మహేష్ ఆన్సర్ ఇచ్చారు. మరో అభిమాని ‘ఈ లాక్ డౌన్ మొత్తం మీ ఫ్యామిలీతో గడపడం ఎలా అనిపిచింది ?’ అని అడగగా.. ‘జీవితానికి సరిపడా ఎక్స్ పీరియన్స్ ఇది. ఈ లాక్ డౌన్ లో నేను వారితో (గౌతమ్ అండ్ సితార) చాల చేశాను. మంచి అనుభవం’ అంటూ మహేష్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.

ఇంకో అభిమాని ‘మీ మూవీ ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది ?’ అని అడగగా.. ‘ముందు ప్రస్తుత క్లిష్ట పరిస్తుతులన్నీ పోయి మంచిరోజులు రావాలి, సాధ్యమైనంత త్వరగా వర్క్ స్టార్ట్ అవ్వాలి. ఆ తరువాత సినిమా రిలీజ్ గురించి చెబుతాను’ అని చెప్పుకొచ్చారు.
అలాగే మరో అభిమాని ‘మీకు బాగా ఇష్టమైన గేమ్ ఏమిటి సర్ ?’ అని అడగగా.. ‘నేను బాగా ఎంజాయ్ చేసేది ఆన్ లైన్ లో మా అబ్బాయి గౌతమ్ తో ఆడే టెన్నిస్, బేస్ బాల్, గోల్ఫ్. ఇవి బాగా ఇష్టపడతాను’ అని అన్నారు. మరో అభిమాని ‘మీ వర్క్ మిస్ అవుతున్నారా ?’ అని అడగగా ‘అవును, కచ్చితంగా మిస్ అవుతున్నాను’ అని చెప్పారు.

మరో అభిమాని ‘మీ పిల్లలు కోసం మీరు వండి పెట్టే బెస్ట్ డిష్ చెప్పమని కోరగా..’ ‘మ్యాగీ నూడిల్స్ అని మహేష్ సరదాగా తెలిపారు. మీకు జీవితంలో ప్రేరణ ఎవరు అని అడగగా’, ‘మా ఫాదర్ కృష్ణగారు అని మహేష్ చెప్పారు.

సంబంధిత సమాచారం :

More