టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అలాగే తన మాజీ భర్త అక్కినేని నాగ చైతన్య విషయంలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఎలాంటి దుమారం రేపాయో తెలిసిందే. అయితే ఈమె చేసిన వ్యాఖ్యలపై మన టాలీవుడ్ ప్రముఖులు అంతా ఏక ధాటిగా ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ వస్తున్నారు. అలా లేటెస్ట్ గా మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా స్పందించడం జరిగింది.
మరి మహేష్ పోస్ట్ చేస్తూ మా సినీ కుటుంబానికి చెందిన సభ్యుల మీద అంత దారుణంగా మాట్లాడ్డం నన్నెంతో బాధకి గురి చేసింది అని ఒక కూతురికి తండ్రిగా, నా భార్యకి భర్తగా, నా తల్లికి కొడుకుగా ఒక మహిళ అయినటువంటి మీరు మరో మహిళపై ఇలా మాట్లాడ్డం అనేది సహించలేనిది అని ఇలాంటి చీప్ మాటలు నిరాధార ఆరోపణలు చేయడం, అందరికీ సినిమా వాళ్లంటే సాఫ్ట్ టార్గెట్ అయ్యారు అని మన భారతమాతని అలాగే సినిమాలో ఉండే ఆడవారి అందరినీ కూడా అదే గౌరవ మర్యాదలు ఇచ్చి చూసుకోవాలని మహేష్ బాబు షాకింగ్ పోస్ట్ పెట్టారు. దీనితో ఎంతో బాధ్యతో మాట్లాడుతూనే సీరియస్ గా తన మాటలని చెప్పేసారని చెప్పాలి.
Extremely pained by the comments made by Minister Konda Surekha garu on fellow members of our film fraternity. As a father of a daughter, as a husband to a wife and as son to a mother… I am deeply anguished by the unacceptable remarks and language used by a woman minister on…
— Mahesh Babu (@urstrulyMahesh) October 3, 2024