మరోసారి మహేష్ బాబుని డైరెక్ట్ చేసిన త్రివిక్రమ్

మరోసారి మహేష్ బాబుని డైరెక్ట్ చేసిన త్రివిక్రమ్

Published on Nov 19, 2014 3:45 PM IST

mahesh-babu
సూపర్ స్టార్ మహేష్ బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘అతడు’, ఖలేజా ‘ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చాలా రోజుల నుంచి ఈ కాంబినేషన్ లో మరో మూవీ ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. వారి కోరికని మహేష్ బాబు – త్రివిక్రమ్ లు మొత్తంగా నెరవేర్చక పోయినప్పటికీ, ఒక చిన్న ప్రకటనతో కొంతవరకూ తీర్చనున్నారు.

అసలు విషయంలోకి వెళితే మహేష్ బాబు హైదరబాద్ లోని రెయిన్ బో హాస్పిటల్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చేయడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా రెయిన్ బో హాస్పిటల్స్ కోసం మహేష్ బాబు రీసెంట్ గా ఓ యాడ్ లో నటించాడు. ఈ యాడ్ షూటింగ్ కూడా పూర్తయ్యింది. ఈ యాడ్ ని డిజైన్ చేసి దర్శకత్వం చేసింది మాత్రం మన మాటల మరాఠీ త్రివిక్రమ్ శ్రీనివాస్. మనం వీరిద్దరి కాంబినేషన్ లో ప్రస్తుతానికి సినిమా చూడలేకపోయినప్పటికీ ఓ ప్రకటన ద్వారా వీరి కాంబినేషన్ ని చూడొచ్చు.

మరి మొదటిసారి మహేష్ తో ఓ యాడ్ తీసిన త్రివిక్రమ్ మహేష్ బాబుని ఎలా చూపించాడో చూడాలంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం మహేష్ బాబు కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్న సినిమాతో బిజీగా ఉంటే, త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో చేస్తున్న సినిమాతో బిజీగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు