రీరిలీజ్ లలో మహేష్ స్టామినా.. “గుంటూరు కారం”తో మళ్ళీ

రీరిలీజ్ లలో మహేష్ స్టామినా.. “గుంటూరు కారం”తో మళ్ళీ

Published on Dec 29, 2024 6:30 PM IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తో చేసిన హ్యాట్రిక్ చిత్రం “గుంటూరు కారం” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం మ్యూజికల్ గా సెన్సేషనల్ హిట్ అయ్యింది. అయితే ఈ చిత్రం నుంచి వచ్చిన పాటలు గ్లోబల్ లెవెల్లో అదరగొడుతుండగా ఈ సినిమా తర్వాత మళ్ళీ జక్కన్న రాజమౌళి సినిమా వరకు కేవలం రీరిలీజ్ చిత్రాలు మాత్రమే మహేష్ ఫ్యాన్స్ కి మిగిలాయి.

అయితే ఈ ట్రెండ్ ని స్టార్ట్ చేసిందే మహేష్ ఫ్యాన్స్ అందులోని అన్ బీటబుల్ రికార్డ్స్ మహేష్ సొంతం అయ్యే రేంజ్ లో సెలబ్రేట్ చేస్తున్నారు. అయితే లేటెస్ట్ గా మళ్ళీ సూపర్ స్టార్ తన స్టామినా చూపిస్తున్నారు అని చెప్పాలి. ఈ ఏడాదికి ముగింపుకి కొత్త ఏడాది ఆరంభానికి సెలబ్రేట్ చేసుకునే విధంగా గుంటూరు కారం స్పెషల్ షోస్ ప్లాన్ చెయ్యబడ్డాయి. మరి ఊహించని రీతిలో ఈ అన్ని షోస్ లో హైదరాబాద్ లో హౌస్ ఫుల్స్ పడిపోయాయి. ఇంకా స్క్రీన్స్ యాడ్ చేస్తున్న కొద్దీ వీటి సంఖ్య కూడా పెరుగుతుంది. దీనితో రీరిలీజ్ ల విషయంలో మాత్రం మహేష్ వేరే లెవెల్ అని చెప్పాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు